మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అంతర్లీనంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. వ్యాధి రావడానికి గల కారణాలను అర్ధం చేసుకొని, గాడీ తప్పిన శరీరపు బండిని తిరిగి సక్రమంగా పట్టాలపైన చేర్చడంతో మా పాత్ర, భాధ్యత ముగిసిపోతుంది. - డాక్టర్ అనిల్ నండూరి
DrNanduri.com గురించి
200 సంవత్సరాల క్రితం యూరప్‌లో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిన హోమియోపతి వైద్య శాస్త్రము పురాతనమైనదే కాక అత్యంత శ్లాఘనీయమైనది కూడా. ఈ వైద్యశాఖ దినదినాభివృద్ధి చెందుతూ, ప్రజల ఆదరణని, మన్నని పొందుతూ వైద్యశాస్త్రంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. హోమియోపతి వైద్యశాస్త్రం స్వాభావిక, పూర్ణ దృక్పధ సిద్ధాంతాల ఆధారంగా వ్యాధిని నిర్ణయించి చికిత్సనిస్తుంది. హోమియోపతి మందులు చాలా ప్రభావవంతంగాను చాలా సున్నితంగానూ రోగిపై పని చేస్తాయని చేస్తున్నాయని జగద్విదితమే. Dr Nanduri Homeopathic Medical Practitioners
దక్షిణ యూరప్, ఇంగ్లాండు, అమెరికాలలో హోమియోపతి వైద్యం ఎప్పటినుండో ప్రాచుర్యంలో ఉన్నా ఈ మధ్యకాలంలోనే పాశ్చాత్యదేశంలో చాలా ప్రాముఖ్యతని గడించిందని చెప్పవచ్చు. ప్రపంచంలోనే భారతదేశం ఈ వైద్యవిధానంలో అగ్రస్థానాన్ని పొందింది. అంతేగాక, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివిధ హోమియోపతి వైద్యబృందాలతో, మందుల తయారీ సంస్థలతో కేంద్ర బిందువుగా వ్యవహరిస్తుందనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. భారతదేశ ప్రభుత్వం హోమియోపతి చికిత్సను "ప్రాధమిక వ్యాధి నిరోధక ఔషధం" గానూ, Encephalitis వంటి వైరల్ జబ్బులను నిరోధించడానికిని, చికిత్సకు ఉపయోగించడానికిని ప్రోత్సహిస్తున్నది.
డాక్టర్ నండూరి శివప్రశాంత్ గారు, వారి కుమారులు డాక్టర్ నండూరి అనిల్ గారు భారతదేశంలోని హైదరాబాదులో చక్కటి వైద్యవృత్తిలో ఉన్నారు. నిష్ణాత వైద్యుల్లా ప్రసిద్ధి చెందిన వీరివద్దకు హైదరాబాదు, చుట్టుప్రక్కల ప్రాంతాలవారే కాకుండా విదేశీయులు కూడా చికిత్స కొరకు వస్తున్నారు. సాధారణంగా అందరు డాక్టర్లు ముఖాముఖిగా రోగి కేసు వివరాలను తెలుసుకోవడానికే ఇష్టపడతారు. ఈ నండూరి డాక్టర్లు వ్యాధి నిర్ధారణ విధానాలనూ చికిత్సా పద్ధతులనూ, "ఇంటర్‌నెట్"కు కూడా అనుకూలంగా మలచుకున్నారు. ఇంటర్‌నెట్ ద్వారా జరుగుతున్న సలహా సంప్రదింపులను ఒక నిర్ణీత పద్ధతిలో వ్యవస్థీకరించడం కోసం ఈ వెబ్ సైట్ ని నిర్మించడం జరిగింది. దీనితోపాటు హోమియోపతి వైద్యవిధానంలోని లాభాలను ఆసక్తి, అభిలాష, జిజ్ఞాస ఉన్న ప్రజలకు తెలియజేయటం వీరి మరొక లక్ష్యం.