హోమియోపతి ఒక సమీక్ష

homeopathic treatment    homeopathy treatment


"We believe in the human body's innate ability to overcome disease by itself. Our role is to understand the causes and set the natural pattern right in the least harmful and the most natural way"

Dr. Anil Nanduri


ఏదైతే వ్యాధికారణమవుతుందో అదే చికిత్సకు ఉపయోగపడుతుందనే ప్రకృతి సహజమైన సిద్ధాంతంపై హోమియోపతి వైద్యవిధానం ఆధారపడి ఉంది. దీనినే లాటిన్ లో "సిమిలియా సిమిలిబస్ క్యురాన్‌టర్" (similia similibus curentur) అంటారు. ఇంచుమించు మన "ఉష్ణం ఉష్ణేన శీతలం" లాంటిదని చెప్పవచ్చు. ప్రకృతిని పరిశీలించడం, అనుకరించడం ద్వారా అన్ని విజ్ఞాన శాస్త్రాలలోనూ గొప్ప గొప్ప విషయాలను కనుగొన్నారు. హోమియోపతి కూడా అటువంటి విజ్ఞానశాస్త్రమే.

ఒకే రకమైన ప్రేరణ లేదా ప్రేరకానికి భిన్నవ్యక్తులు భిన్నభిన్న రకాలుగా స్పందిస్తారనే అస్తివాదంపైన హోమియోపతి ఆధారపడి ఉంది. దీన్నే మూర్తిత్వ వ్యక్తిత్వమంటారు. హోమియోపతికి మాత్రమే సంబంధించిన విలక్షణ అంశమిది. ఉదాహరణకి ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళు మండటం, ముక్కు కారడం సర్వ సాధారణ విషయం. ఒకొక్క సారి తుమ్ములు కూడా వస్తుంటాయి. కారప్పొడితో కూడా ఇంచుమించు ఇలాగే జరుకుతుంది (కూరలో వేసేటప్పుడు కాదు బాబు! గ్రైండర్ లో పొడి చేసేటప్పుడు) కళ్ళు మంటలు, నీళ్ళు కారడం, తుమ్ములు, వగైరా. కాని ఈ రెండింటి ఫలితాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఉల్లిపాయలవల్ల ముక్కు కారడం కళ్ళు మంటలు, నీళ్ళు కారడం అయితే, కారప్పొడి వల్ల కళ్ళు, ముక్కు రెండూ మంటలు పుడుతూ "స్రావం" మాత్రం నీళ్ళలా ఉంటుంది. రెండింటివి సాధారణ జలుబు లక్షణాలే అయినా "స్రవించే ద్రవ" లక్షణాలు వేరుగా ఉంటాయి. అలాగే జలుబుతో బాధ పడే ఇద్దరు వ్యక్తులకి, అది బహిర్గతమయ్యే లక్షణాలనుబట్టి రెండు రకాల విభిన్న మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నో పదార్థాలవల్ల, కారణాలవల్ల సాధారణంగా జలుబు చేస్తుంటుంది కాని ఆయాలక్షణాలు కొద్దిపాటి భేదంతో వేర్వేరుగా ఉంటాయి. ఆయాలక్షణాలు వివిధరకాల జలుబులకి చికిత్స చేయడానికి ఉపకరిస్తాయి.

మొట్టమొదటి సారిగా హోమియోపతి చికిత్స తీసుకుంటున్న వ్యక్తికి డాక్టర్లు కురిపించే ప్రశ్నలవర్షానికి విస్మయాశ్చర్యాలే కాక కొంచెం విసుగు కూడా వస్తుంది. కాని ఈ "ప్రశ్నోత్తరాల" వల్ల ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ మూర్తిత్వాల ద్వారా ఆ వ్యాధి లక్షణాలు ఏరకంగా ప్రస్ఫుటమవుతున్నవో తెలుస్తుంది. తద్వారా సరియైన చక్కటి ఔషధం ఇవ్వడానికి వీలు కలుగుతుంది. సరే! భూమి గుండ్రముగా ఉండును! జలుబు ఉదాహరణకే వద్దాము, జలుబు వల్ల కొంతమంది మానసిక సంతులత పోయి చీటికి మాటికి చిరాకు పడుతుంటారు. వీళ్ళ ముందు "ఆ" అన్నా "ఊ" అన్నా తప్పే, కస్సుమంటుంటారు. మరి ఇదేమిటి? శారీరకంగా కన్పిస్తున్న వ్యాధి యొక్క మానసిక చేష్ట అన్నమాట. ఒక్కొక్కసారి ఆకలి ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు, లేదా రుచులు మారవచ్చు. ఒక రకమైన రుచి కోసం జిహ్వచాపల్యం ఉండవచ్చు. లేదా ఏదో ఒక తినే పదార్థాన్ని చూస్తే కడుపులో తెమలవచ్చు. ఇలాంటి లక్షణాల సమాచారమంతా ఆ వ్యాధికి సంబంధించిన మందుల జాబితాలోనుండి ఖచ్చితంగా నికార్సైన మందు ఇంత మోతాదులో ఈ వ్యక్తికి నప్పుతుంది అని న
ిర్ధారించడానికి సహాయపడుతుంది.




 

Homeopathic Treatment   |  About Homeopathy  |  About Us  |   FAQ  |  Articles & Links  |  Consultation  |   Contact Us  |  Blog