ఆర్టికల్స్
homeopathic treatment    homeopathy treatment


"We believe in the human body's innate ability to overcome disease by itself. Our role is to understand the causes and set the natural pattern right in the least harmful and the most natural way"

Dr. Anil Nanduri


టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన డాక్టర్ నండూరి శివప్రశాంత్‌గారి ఆర్టికల్స్

1. హోమియోపతి పరిధి, పరిమితులు

కాన్సర్, డయాబిటీస్, స్పాండిలోసిస్, మొదలైన వాటికి హోమియోలో చికిత్స ఉందా? అని చాలా తరచుగా, చాలా మంది ఫోన్ చేసి అడుగుతుంటారు. ఎంతకాలంలో గుణం కనిపెస్తుంది? ఎంతకాలంలో పూర్తిగా నయమవుతుంది? ఒక వేళ తగ్గితే పూర్తిగా తగ్గినట్టు లెక్కేనా? అంటే చికిత్సకు ఏదైనా గ్యారంటీ ఉందా? వీటన్నింటికీ ఖచ్చితంగా సమాధానాలు కావాలంటారు, అదీ ఒక్క ఫోన్ కాల్ లోనే. వీళ్ళలో చాలా మంది సంవత్సరాల తరబడి బాధ పడుతూ, నగరంలో ఉన్న అందరి స్పెషలిస్ట్స్ దగ్గర చికిత్స పొంది వ్యాధి బొత్తిగా నిమ్మళించకపోవటమో లేదా కాస్తో కూస్తో గుణం కన్పించటమో జరిగిన వాళ్ళే. అయితే తమాషా ఏమిటంటే వీళ్ళు ఇవే ప్రశ్నలను ఆ ఎల్లోపతి డాక్టర్లను అడగరు. వేరే వైద్య విధానాన్ని ప్రయత్నించి చూద్దామన్న ఆలోచన రావడానికి చాలా ముందు, ఆ ఎల్లోపతి డాక్టర్లిచ్చిన మందులన్నీ ఎదురు ప్రశ్న లేకుండా చాలా రిచుయల్‌గా రోజుల తరబడి వాడుతుంటారు.

అంచేత హోమియోపతి ఏమివ్వగలుగుతుంది?

స్వాభావిక వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చిన వ్యాధులకు (auto immunition disorders) ఎలర్జీలకు, వృత్తిరీత్యావచ్చే వ్యాధులకు (effects of occupational disorders), ఆడవాళ్ళ సమస్యలకు, ఎదుగుతున్న పిల్లల, వయోవృద్ధుల సమస్యలకు హోమియోలో ప్రభావవంతంగా పని చేసే మందులున్నాయి.

కాన్సర్, డయాబిటీస్, మొ|| వాటి విషయానికి వస్తే ఆయా వ్యక్తుల జీవన విధానంలో చక్కటి పాజిటివ్ మార్పును తెస్తుంది. కాన్సర్, గ్రస్తులైన వ్యక్తులు ఖెమోథెరపీ, రేడియేషన్ లేదా సర్జరీ తర్వాత విపరీతంగా బలహీనమవడం, బొత్తిగా ఆకలి లేకపోవడం, ఎక్కడో చెప్పలేని బాధ,నెప్పి ఉండటం వీటన్నింటి వల్ల వేరే వైద్య విధానాన్ని ప్రయత్నించాలని సాధారణంగా అనుకుంటారు. హోమియోపతిలో పాలియేటివ్ డ్రగ్స్ ఉన్నాయి. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోగా ఊరట, ఉపశమనం కల్గుతాయి.

కన్‌జెనిటిలో ఎనామలీ (శారీరిక, మానసిక, నరాలకు సంబంధించిన ఏదైనా అవయవం కాని సిస్టమ్ కాని ఉండాల్సిన విధంగా ఉండకపోవడం), ఉదాహరణకి harelip (పై పెదవి మధ్యకు చీలి ఉండటం, సాధారణంగా కొంతమంది పిల్లలు పుట్టడమే ఇలాగే పుడతారు), clubfoot (కొంతమంది పిల్లలకు పుట్టుకతో పాదాలు వంకరగా, వేళ్ళు కిందకి వంగి ఉండటం లాంటివి) మొదలైన వాటికి ఎలా శస్త్ర చికిత్స చేస్తారో అలాగే అత్యవసర వైద్య సహాయం కావలసి వచ్చే అబ్డామినల్ (పొట్ట) కి సంబందించిన సమస్యలు - తీవ్రమైన ఎప్పెండిసైటిస్, ట్విస్టెడ్ బవల్స్ (లోపల, చిన్నప్రేవులు కాని పెద్ద ప్రేవులు కాని ట్విస్ట్ అవడంవల్ల బవల్స్ ఖాళీ అవక, వచ్చే బాధలు), ఫ్రాక్చర్లు, యాక్సిడెంట్స్ వీటికి కూడా మొదట సర్జికల్‌గానే వైద్యం చేయాలి. దీనివల్ల ఆ వ్యక్తులకు వచ్చే బాధలు, నెప్పులు మొదలైన వాటిని హోమియో మందుల ద్వారా తగ్గించ వచ్చు. విరిగిన ఎముకలని, దానికి సంబంధించిన సర్జన్ అతికించాలి, కాని సర్జరీ తరువాత బోన్స్ తొందరగా సెట్ అవడానికి, హోమియోలో మందులున్నాయి. ఎటువంటె గాయానికైనా సరే సర్జన్లు వాళ్ళ కర్తవ్యం నిభాయించాక, నెప్పి త్వారగా తగ్గడానికి హోమియోలో మందులున్నాయి. వెంటనే అట్టెండ్ అవ్వాల్సి వచ్చే విష ప్రయోగాల కేసులను (ఆత్మ హత్య, హత్యా ప్రయత్నం, యాక్సిడెంట్ మొ||) "ఎమర్జన్సీ మెడికల్ డిపార్ట్‌మెంట్‌" వాళ్ళే చికిత్స చేయాలి. కానీ విషపదార్థాలలాంటి (toxins) వాటికి ఎప్పుడూ ఎక్స్‌పోజ్ అవుతూ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బాధ పడేవారికి హోమియో చికిత్స ద్వారా గుణం కల్గించవచ్చు. చర్మాన్ని గ్రాఫ్‌ట్ చేసాకకూడా నయం కాని అల్సర్లను కూడా చక్కబరచవచ్చు. చాలా వరకూ అవయవాలని ఖండించే పరిస్థితి రాకుండా చేయవచ్చును. పోషకపదార్థాల లోటు (deficiency) వల్ల వచ్చే వ్యాధులకు హోమియోపతిలో ఏ మందూ లేదు. ఎందుకంటే ఏ పోషకపదార్థాలు లేని ఆహారం తినకుండా శరీరానికి కావలసిన పోషకపదార్థాలు, విటమిన్లు ఉన్న చక్కటి ఆహారం తీసుకోవాలని ప్రతి ఒక్కరికీ తెలిసిన సాధారణ విషయం.

అయితే పోషకపదార్థాలతో కూడిన సంతులిత ఆహారాన్ని తీసుకుంటున్నా వచ్చే mal absorption (జీర్ణమైన పోషకపదార్థాలను ప్రేగులు సరిగా స్వీకరించకపోవడం) వంటి అస్వస్థతలకు హోమియోలో మందులున్నాయి. అదీకాక అలాంటపుడు గ్లుటెన్ (బంక) లేని పదార్థాలు తీసుకోవాలి. (గోధుమలు, బార్లీ, మైదా, rye వంటి పదార్థాలు వాడకూడదు). మేము గమనించిన పరిధిలో మూడు పూటలా చక్కగా తినగలిగిన వాళ్ళే నీరసంగా ఉంటున్నదని టానిక్‌లు సజెస్ట్ చేయమని అడుగుతూ ఉంటారు. వీళ్ళు చేయాల్సింది ఏమీ లేదు. వేళా వేళకు ఇంత వ్యాయామం, చక్కటి పాజిటివ్ దృక్పధం, సంతులిత ఆహారం, కొద్దిగా జీవనపద్ధతిని మార్చుకోవడం, అంతే. విటమిన్లు ఎక్కువగా తీసుకున్నా శరీరంలో చురుకుదనం పోయి ఎప్పుడూ సుస్తీగా నలతగా ఉంటుంది. ఐరన్ ఉన్న భోజనపదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది. ఐరన్ శరీరంలో కలసిపోవాలంటే ఆసిడ్ మీడియా ఉండాలి (అందుకనే మనవాళ్ళు మొదటి ముద్దలు ఉసిరికాయ, గోంగూర తినాలని అనేవారు) ఇది కాస్తా మనం టానిక్‌లలో వెతుక్కొని అన్నం తిన్నాక సీసా ఎత్తి గడగడా తాగితే లాభం లేదు.

హోమియోపతి పరిధి అన్నిరకాల ఇన్‌ఫెక్షన్లు, ఎలర్జీలు, ఆటో ఇమ్మ్యూన్ వ్యాధులు, వృత్తి సంబంధ వ్యాధులు, గైనకాలజీ సమస్యలు, చిన్నపిల్లల, వృద్ధుల వ్యాధుల వరకే పరిమితమై ఉంది. చికిత్సకు లొంగని కొన్ని వ్యాధులకు సర్జరీకి వెళ్ళవలసి ఉంటుంది. ఇది వైద్యం చేస్తున్న హోమియో డాక్టరు నిశ్చయించి దాని ప్రకారం చేయాలి. విపరీతమైన, వెనక్కి మళ్ళీ మళ్ళించలేని శారీరిక నిర్మాణ మార్పులున్నచోట్ల హోమియోలో పాల్లియేటివ్ చికిత్స ఉంది. తద్వారా రోగి కొంత వరకు ప్రశాంతంగా (సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చిన ఏ నెప్పులు) ఉండవచ్చు. పూర్తిగా స్వస్థత చేకూరుతుందా? లేదా? అనే విషయం నిర్ధారించడానికి, వాళ్ళ వయసు, రోగి శరీరస్థితి, రాగ స్వభావం, వ్యాధి ఎక్కడ, ఎన్నో స్టేజ్‌లో ఉంది? జీవన ప్రమాణం ఏంటి? అన్నింటి కంటె ప్రధానమైనది ఆ వ్యక్తి దృక్పధం, ఇన్ని అంశాలను పరిశీలిస్తే తప్ప (ఫోన్‌లో) చెప్పలేము. హోమియోపతి ఏదో "ఛూమంతర్" (అనగానే ఠక్కున వ్యాధులు-జబ్బులు, కష్టాలు-కడగళ్ళు పోయే) వైద్యం కాదన్నది ఎంత వాస్తవమో హోమియో కేవలం దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రమే చికిత్సకు పనికి వస్తుందన్నది అంత అపోహ. భ్రమ. అవాస్తవికత.

వెంటనే చికిత్స చేయాల్సివచ్చీ ఇన్‌ఫెక్షనల్ వ్యాధులకు, అడపా-దడపా వచ్చే జ్వరాలు, తగ్గుతూ-వస్తూ ఉండే నలతలు (సాధారణంగా తలనెప్పులు), ఏమందుకు స్పందించని వ్యాధులు వీటన్నింటికి హోమియోలో చక్కటి చికిత్స ఉంది. మంచి హోమియో డాక్టర్లు వాళ్ళ పేషెంట్స్‌ని (అవసరమైన పరిస్థితులలో) మంచి స్పెషలిస్టులవద్దకు పంపుతారు, వ్యాధి నిర్ధారణకు అనుకూలించే అన్ని సాధన (ఎక్స్-రేలు, స్కాన్‌లు, లాబ్ టెస్ట్‌లు, వగైరా) లను చక్కగా ఉపయోగించుకొంటారు. ప్రతి ఒక్క వైద్య శాస్త్రానికి తనదంటూ ఒక పరిధి, హద్దులు ఉంటాయి. ఒక దానిపై ఇంకొకటి నిర్హేతుకమైన అభిప్రాయాలనేర్పరచుకొని వ్యవహరించకుండా ఒక దానికి మరొకటి పూరకముల వలె మెలగుతూ వీలైనంత వరకు వ్యాధులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రాచీన ఆయుర్వేద వైద్య శాస్త్రజ్ఞుడైన చరకుని మాటల్లో చెప్పాలంటే "ఏది చికిత్స చేయగలుగుతుందో అదే వైద్యం, ఎవరు చికిత్స చేయగలుగుతారో వారే వైద్యులు" ఎంత నిజం!!

2. హోమియోపతి వ్యక్తిగత విషయాల్లో తలదూరుస్తుందా?

Ms. ఎక్స్ కోపోద్రిక్తులయ్యారు. " పీరియడ్స్ గురించి అడగడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి? నేనిక్కడ జలుబుకి మందు కోసం వస్తే మీరేంటి పీరియడ్స్ గురించి అడుగుతారు?" అంటూ అరవడం మొదలుపెట్టారు. కాక పోతే నా ప్రశ్నలకు ఇటువంటి ప్రతిచర్యలు చూడటం అది మొదటిసారి కాదు కనక నేను మెల్లగా ఆమెకు నచ్చచెప్పాను, "చూడమ్మా! మీ విషయంలో జలుబు ఏదో నాలుకు రోజులు సతాయించి తగ్గడమో, లేకపోతే సీజన్ మారడంవల్ల రావడమో కాదు కదా. మీకు సంవత్సరంతా జలుబు ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇన్‌ఫర్‌మేషన్ సరియైన మందు ఇవ్వడానికి నాకు ఉపయోగపడుతుంది." నా మాటలేవీ పట్టించుకోకుండా లోలోపల శపథాలు చేసుకుంటూ ఆవిడ వెళ్ళిపోయారు.

కాని మళ్ళీ ఆ Ms. ఎక్స్ Ms. వై తో వచ్చారు. Ms. వై నా పాత పేషెంట్, ఈవిడే ఎక్స్ గారిని నా దగ్గరికి రికమెండ్ చేశారు. Ms. ఎక్స్ ఆ రోజున నాతో అమర్యాదగా ప్రవర్తించినందుకు క్షమార్పణలు చెప్పారు. హోమియోలో ఇవన్నీ అడుగుతారని తనకు తెలియదని చెప్పారు. కాని తర్వాత Ms. వై ద్వారా హోమియోలో కేస్‌టేకింగ్ పద్ధతిలో ఇవి చాలా నార్మల్‌గా అడిగేవని తెలుసుకొని, "ఇపుడు మీరడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్తాను" అని కూడా చెప్పారు. తరువాత ఆమెకు పూర్తిగా నయమవడంతో చాలా మంది పేషెంట్లకు నా పేరు చెప్పి పంపడమే కాకుండా ఆవిడే వారికి ముందుగా కోపం తెచ్చుకోకుండా నేనడిగే ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పాలని తర్ఫీదిచ్చి పంపేవారు. ఎమర్సన్ చెప్పినట్లు "ఈ ప్రపంచాన్ని తనదైన పద్ధతిలో ఎదుర్కొంటున్న మనలోని ప్రతి ఒక్కరూ ఒక విశిష్ట వ్యక్తే."

ఈ నమ్మకమే హోమియోపతి వైద్యుణ్ణి రోగులతో వ్యవహరించడానికి ప్రేరణనిస్తుంది. ఒక వ్యాధిని ఒక వ్యక్తి తనదైన ధోరణిలో ఎలాగ ఎదుర్కొంటున్నాడు? అన్న కోణాన్నుండి హోమియో చికిత్స మొదలవుతుంది. కాబట్టి అడిగే ప్రశ్నలలో పేషెంట్ యొక్క గుణగణాలు, స్వభావాలు, భావావేశాల గురించి కూడా ఉంటాయి. అందువల్ల ఉన్న సమస్య వదిలి, దానికి సంబంధంలేని ఏవో ప్రశ్నలడిగి, అధిక ప్రసంగం చేసినట్లు అయి పేషెంట్‌కి ఈవిధానం ఒక పజిల్ లాగా ఉంటుంది. పేషంట్ Ms. ఎమ్ వాళ్ళ బాబుగురించి మాట్లాడుతూ "మీకు తెలుసా, డాక్టర్, మా అబ్బాయి వాడికి ఒంట్లో బాగున్నంత వరకు ఒక్కడే ఆడుకుంటాడు, ఒక్కడే ఉంటే సంతోషంగ ఉంటాడు, పదిమందితో కలవడు .కానీ, కొద్దిగ నలతగాఉంటే చాలు,ఒక్కడు ఉండటానికి భయ పడ్తాడు. వాడి పక్కనే ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాలి. పెద్దగా జ్వరమే అక్ఖర్లేదు, కొద్దిగ నలతగా ఉన్నా చాలు, ఇదీ వాడి ధోరణి," అని చెప్పారు. "ఒక్కడే ఉండడానికి భయం, నలుగురిలో ఉండాలన్న కోరిక," ఇవీ ఆ బాబు స్వభావంలోని మార్పులు.

ఇలాగే స్వభావంలోని మార్పులకు ఇంకొక ఉదాహరణ చూద్దాం, Ms. ఎస్ వాళ్ళ అబ్బాయి P గురించి, "P ఎపుడూ నవ్వుతూ ఉంటాడు. అస్సలు ఏడవడు. కాని చిన్న జలుబు చేసినా ముఖమంతా మాడ్చుకుని ఏడుస్తూనే ఉంటాడు. ఎప్పుడూ వాణ్ణి కనిపెట్టుకొని దగ్గరే ఉండాలంటాడు. (longing for attention). Ms. ఎల్, "K కి ఒంట్లో బాగా లేనపుడు, జ్వరం వచ్చినపుడు కాఫీయే కావాలని మారాం చేస్తాడు. కాని జ్వరం తగ్గిందో కాఫీ అస్సలే ముట్టుకోడు. రెగ్యులర్‌గా తాగే పాలే కావాలని అడుగుతాడు" అని చెప్పారు. సాధారణంగా పేషెంట్లు అంతకుముందే వేరే డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆయన వరుసగా బోలెడన్ని టెస్టులు చేశాక వ్యాధి నిర్ధారణ చేసి మందులివ్వడం జరిగాక నా దగ్గరకి వస్తారు. వాళ్ళు రావడంతోటే వాళ్ళ వ్యాధి "మైగ్రేన్" అనో "డయాబిటిస్" అనో, "ఎమీబియాసిస్", "సైనసైటిస్", "కిడ్నీస్టోన్స్", "ఆర్థ్‌రైటిస్" ఇలా ఏదో ఒక పేరు చెప్పి దానికి హోమియోలో మందులున్నాయా? అని అడుగుతారు. హోమియో డాక్టర్‌కి ప్రెస్‌క్రిప్షన్ ఇవ్వడానికి వ్యాధి నిర్ధారణ ఒక్కటే కొలమానం కాదు. ఆ వ్యక్తి విలక్షణ లక్షణాలు క్షుణ్ణంగా తెలిస్తేనే తప్ప హోమియో డాక్టర్లు ప్రిస్‌క్రిప్షన్ ఇవ్వలేరు. చాలా మంది పేషెంట్లకు పాఠ్యపుస్తకాలలో వర్ణించిన వ్యాధి లక్షణాలు లేదావ్యాధులుండవన్న విషయం హోమియో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లందరికీ అనుభవమే, అలాంటపుడు ఆయా రోగుల వ్యక్తిత్వ లక్షణాలే మా చికిత్సకు తోడ్పడుతాయి.

ఆహారానికి రోగికి ఉన్న (అవినాభావ) సంబంధం ప్రధానాంశం. కొంతమందికి ఆకలివల్ల తలనెప్పి వస్తే మరికొందరికి కడుపు ఎప్పుడూ ఉబ్బరంగా ఉంటుంది. కొంతమంది కరెక్టుగా తినే సమయంలో తినికపోతే చిరాకు పడుతుంటారు, లేదా ఛాతీలో నెప్పి వస్తుంది, నీరసం, దడ, ఒళ్ళు వణకడం, ఆకలికి అస్సలు తట్టుకోలేరు (ఆ.. ..ఆం నోట్లోకి వెళ్ళి పోవాలేమో!) మరి కొంతమందికి అబ్బే! ఏం బాధలేదు. తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఆకలి వస్తే ఏంటో చూసాము. ఇక ఎలాంటి "ఆకలి" చూద్దాం. వివిధరకాల ఆకళ్ళు తగ్గట్టుగా తిండిపోతని, నిలకడ లేని భోజన అలవాట్లని (ఒక రోజు కారం, ఒక రోజు తీపి వగైరా) అన్నీ పీక్కుని పరపరా తినడం - ఇలాంటివి తెలియడం కూడా హోమియో చికిత్సకు ఉపయోగపడ్తాయి. కొంతమందికి కంచంముందు కూర్చునేంతవరకు ఆకలి ఉండదు, మరికొంతమంది కొద్దిగా ఎక్కువ వడ్డిస్తే పారేస్తారు.

ఇలాంటి ఎక్కువ-తక్కువలు, హోమియోపతి వైద్యుని దృష్టిలో చాలా ప్రాముఖ్యత ఉన్న అంశాలు. కాబట్టి ఇలాంటివి కూడా చెప్పాలి. కొంతమంది బవల్స్ ఖాళీ చేసుకోడానికి పో..ద్దునే లేచిపోతారు. లేవగానే బాత్రూమ్‌కి పరుగో పరుగు. [మీరు పొద్దునే లేవగానే ఏం చేస్తారు సర్! టాయ్‌లెట్] పొద్దునే లేవగానే చేసే మొదటి కార్యక్రమం- ప్రకృతి పిలుపుకి హాజరేసుకోవడం. మరికొంతమందికి కప్పు టీయో, కాఫీయో కడుపులో పడాలి, కొంతమందికి ఒక సిగరెట్ తాగాలి అప్పుడు కాని బవల్స్ కదలవు. మరికొంత మందికి (బాబో! చెప్పకండి సార్!)

కడుపులో ఘన, ద్రవ పదార్థాలలో ఏదో ఒకటి పడ్డా ఒలింపిక్ రేసే! కొంతమందికి ఎన్ని రోజులైనా వెళ్ళాలనే అర్జ్ ఉండదు. నా పేషెంట్లలో ఒక ఆవిడకు నీళ్ళు పడుతున్న చప్పుడు వింటే కాని రిలీఫ్ పొందలేరు. అందుకని రెస్ట్ రూంలో నల్లా తెరిచే ఉంచుతారు. ఇలాంటి విలక్షణాలు హోమియో డాక్టర్లకు ఒక క్లూ లాగ పని చేస్తాయి. నిద్ర పోయే విధానాలు కూడా మాకు అప్రధాన అంశాలు కావు. ఆ వ్యక్తి ఎక్కడైనా, ఎప్పుడైనా నిద్ర పోగల్గుతారా? నిద్ర పోయి లేవడంవల్ల తాజాగా అనిపిస్తుందా? లేదా? ఇలాంటి విషయాలు ఆ వ్యక్తిని ట్రీట్ చేస్తున్న డాక్టర్లకి, వారి స్వభావాన్ని తెలియచేసి సరియైన మందు ఇవ్వడానికి సహకరిస్తాయి.

కలలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. (వినడానికి కాదు బాబూ మందు ఇవ్వడానికి) కొన్ని సార్లు పేషెంట్ల దగ్గర నుండి కలల గురించిన పూర్తి వివరాలు సేకరించడం చాలా కష్టమవుతుంది. "ఆ మామూలు కలేనండి" అనేది అందరు మొదట చెప్పే సమాధానం. కాని హోమియో డాక్టర్‌కి కలల పూర్తి వివరాలు కావాలి. కలల సారాంశం ఏంటి? పాము కలలు, ఏదో ఎత్తు మీదనుండి పడిపోవటాలు, నీళ్ళగురించి, రోజూ జరిగే సంఘటనలు, చనిపోయిన బంధువులు - ఇవన్ని కూడా ఆ వ్యక్తికి, ఎటువంటి చికిత్సనివ్వాలో నిర్ణయించడానికి ఉపయోగ పడతాయి. వ్యక్తి చెమట పట్టే విధానాన్ని బట్టి కూడా వ్యక్తిత్వ లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొంత మందికి ముక్కు కొన మీద మాత్రమే లేదా పై పెదవిపైన చెమట పడుతుంది. కొంతమందికి అరచేతుల్లో అయితే కొంతమందికేమో తల్లో. అది సీజన్ వల్లనయినా కావచ్చు, లేదు అదుర్దా, భయం, మొ|| వాటి వల్ల కావచ్చు. కొంత మందికి అన్నం వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా, ఏకాలంలోనైనా సరే అన్నం తింటుంటే మాత్రం చెమటలు పడతాయి. కొంతమందికి నిద్ర పోయేటపుడు చెమటలు పడితే కొంత మందికి బవల్స్ ఫ్రీ అయ్యేటపుదు చెమట నీళ్ళలాగానో లేదా జిడ్డుగా నూనెలాగానో దుర్గంధభరితంగానో, చేదు వాసనలానో, భరించలేని వాసనో, బట్టలకుక్ చెమట మరకలు పట్టవచ్చు, పట్టక పోవచ్చు - మళ్ళీ ఇవన్నీ వ్యక్తిగత లక్షణాలే.

ఇక ఆడవాళ్ళ విషయాలలో, ఋతుచక్రము ప్రధానాంశం. [Premenstrual Syndrome] పీరియడ్స్ వచ్చే ముందు చాలా మందికి వచ్చే లక్షణాలు నడుంనెప్పి, తలనెప్పి, కడుపునెప్పి మొ|| అందరికీ తెలిసినదే. [Premenstrual Tension] పీరియడ్స్ వచ్చే ముందు టెన్షన్‌గా ఉంటుంది అని చెప్పితే ఏ విషయమూ కన్వే అవదు. అందువల్ల హోమియో డాక్టరు కొంచెం వివరించి చెప్పమని అడగవచ్చును. ఒక స్త్రీ PMS మూడ్స్ మారడం, [క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ - అని] విపరీతమైన నడుంనెప్పి, వాంతులు, తలనెప్పి, ఒక్కొక్క సారి పీరియడ్స్ ముందు, పీరియడ్స్ సమయంలోను, తరువాత కూడా నీళ్ళ విరేచనాలతో బాధ పడవచ్చు. పీరియడ్స్‌కి ముందు, ఆ నాలుగు రోజులు, ఆ తర్వాత రెండు, మూడు రోజులు, ఆకలి, నిద్ర, బవల్స్ మూవ్‌మెంట్‌లో కూడా మార్పు ఉండవచ్చు. కాబట్టి ఇవి కూడా చెప్పాలి.

ఏది ఏమైనా ఈ అధునాతనకాలంలో చిన్నవాళ్ళ దగ్గర్నుండి ప్రారంభిస్తే వయసౌ మళ్ళిన వాళ్ళవరకు అదుర్దా, టెన్షన్ ఈ రెండూ చాలా సాధారణమయ్యాయి. కాకపోతే వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యక్తం చేస్తారు. కొంతమంది చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఏదీ ఎవ్వరితోను చెప్పరు, మాట్లాడరు, కొంతమందికి నోట్లోంచి మాటరావడానికి చాలా కష్ట పడతారు, కొంతమందికి నత్తిలా, ఆయాసం, దడ, కళ్ళు బైర్లు కమ్మడం, వాంతులు, విరేచనాలు, విపరీతమైన చెమటలు మొదలైన లక్షణాలుంటాయి. ఏదో వచ్చేసి "డాట్రారూ! నాకు చాలా తొందరగా టెన్షన్ వచ్చేసి నర్వస్ అయిపోతానండి" అంటే ఏమీ సరిపోదు. ఆ టెన్షన్ ఎలా వెంటిలేట్ చేస్తారు, ఏ ధోరణిలో బహిర్గతంచేస్తున్నారు, చేయడంలేదు సవిస్తరంగా చెప్పాలి. ఒక పేషెంట్ ఆమె టెన్షన్ అయినా లేదా ఎక్సైట్ అయినా అంతకు నాలుగయిదు రోజుల క్రితమే పీరియడ్స్ అయిపోయినా మళ్ళీ వెంటనే మెన్సస్ మొదలవుతుందని చెప్పారు. హోమియోపతి చికిత్సకు, వ్యక్తి గుణగణాలు, స్వభావం - మితభాషిత్వం, చాలా ఫార్మల్‌గా హల్లో అంటే హల్లో అనడం, కొత్త వాళ్ళతో అయినా తొందరగా కలిసిపోవడం, కొత్త స్థలంలో, కొత్త పరిస్థితులలో చాలా తొందరగా ఇమిడి పోవడం - ఇవన్ని భిన్న వ్యక్తిత్వ లక్షణాలు - ఇవి చాలా ముఖ్యం.

కొంతమందికి తలమీద నుండి పొరపాటున టోపీ కింద పడ్డా సర్రున కోపం ముంచెత్తుకొస్తుంది. మరికొంతమందికి లోపల అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా పైకి ఏదీ వ్యక్త పరచకుండా చిద్విలాసంగా చిన్మయంగా ఉంటారు. కొంతమంది కాల్పనిక, వాస్తవ అవమానాల గురించి రోజుల తరబడి ఆలోచించడం, విశ్లేషించడం, కొత్త కొత్త అపార్థాలు వెతికి తెగ వర్రీ అయిపోవడం చేస్తుంటారు. ఎవరైనా ఏదైనా అన్నా కొందరు త్వరగా మర్చిపోతారు. కొందరేమో కన్నుకు కన్ను, పన్నుకు పన్ను ధోరణిలో ఉంటారు. ఇందులో కొన్ని కాని అన్నీ కాని వ్యాధికి సంబంధించిన లక్షణాలే. అది కాన్సరే కానీండి; సాధారణ జ్వరమే కానీండి - ఒక వ్యాధి నిర్ధారణ వ్యాధితో పాటు సంక్రమించిన వ్యక్తిత్వ లక్షణాలు ఈ రెండూ కలిసి ఆ వ్యాధికి అదొక విశిష్టమైన లేదా విచిత్రమైన వ్యాధి లా ఉంటుంది. ఇలాంటి చిన్నచిన్న (మీకు) లక్షణాలు కూడా గుర్తు పెట్టుకొని చెప్పినట్లయితే మాకు చక్కటి మందు ఇవ్వడాన
ికి వీలవుతుంది.వీరి మరొక లక్ష్యం.





 

Homeopathic Treatment   |  About Homeopathy  |  About Us  |   FAQ  |  Articles & Links  |  Consultation  |   Contact Us  |  Blog