నండూరి డాక్టర్లు చికిత్స చేసిన కేసులు:
బాధ్యత మాది కాదని మనవి: ఏ వైద్య విధానమూ సంపూర్ణము కాదు, ఏ వైద్యుడూ అద్భుతాలను చేయలేడు. దీనికి హోమియోపతి కాని, వైద్యులు కాని మినహాయింపు కాదు. మేము ఇక్కడ ఉదహరించిన కేసులు మేము చికిత్స చేసిన, చేస్తున్న వాటిలో కొన్ని మచ్చుతునకలు మాత్రమే. రోగి చాలా సహనంతో మాతో ఎంతో సహకరించినా మేము మావైపునుండి అన్ని రకాలుగా ప్రయత్నించినా కొన్ని చోట్ల మేము సాఫల్యం పొందలేకపోయాము. ప్రతీ వ్యాధికి మాదగ్గర అద్భుత తాయత్తు ఉందనో లేదా మేము నూటికి నూరుపాళ్ళు అన్ని కేసులు విజయవంతంగా చికిత్స చేశామనో చెప్పడం లేదు. మా పరిధి ఎంతవరకు విస్తీర్ణమయి ఉందో, మా చికిత్సా విధానమెలాంటిదో తెలియ చేయడానికి మాత్రమే ఈ కేసులనుదహరించడం జరిగింది.
మైగ్రేన్స్:
ఓ ముప్ఫై రెండేళ్ళ యువతి మావద్దకు చికిత్సకు వచ్చింది. ఆమె మాటల్లో చెప్పాలంటే ఆమె విడాకులు తీసుకున్న దగ్గర్నుండి తల బద్దలయేంత తలనెప్పితో బాధ పడుతుంది. మా దగ్గరికి వచ్చేసరికే విడాకులు తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది. పీరియడ్స్ మొదటి రోజు మొదలు పెట్టిన తలనెప్పి చివరి రోజు వరకు అలా కొనసాగుతూనే ఉంటుంది. పీరియడ్స్ మాత్రం చాలా రెగ్యులర్ గా వస్తాయి. బొత్తిగా ఏ పనీ చేయడానికి వీలుకాక, ఓపిక లేక్, చిమ్మచీకటి గదిలో పడుకొని ఉంటే కొంచెం తేలిగ్గా ఉన్నట్లు అన్పిస్తుంది. శరీరంలో ఏ మాత్రం కదలిక కూడా కడుపులో వికారం, కళ్ళు బైర్లు కమ్మినట్లు ఉంటుంది. ఆ నాలుగు రోజులు అలా పడుకుని నిద్రపోతూనే ఉంటారు. ఆకలి ఉండదు. ఆ చీకటి గది నుండి సాధ్యమైనంత వరకు బయటికి రారు. తలనెప్పి తగ్గించాలంటూ మా దగ్గరికి వచ్చారు. వారి వ్యక్తిగత విషయాల గురించి కొంచెం అడిగాక తెలిసిన సంగతులేమిటంటే ఆమె చాలా సున్నిత మనస్కురాలు, తన భావాలను సరిగా వ్యక్తం చేయలేరు. అన్నీ పరిశుభ్రంగా ఉంచే వారి గుణం వెఱ్ఱిలా ముదిరిందనే చెప్పవచ్చు. బాల్యం ఏమంత సంతోషంగా గడవలేదు. విడాకులు తీసుకున్నాక ఆమె పూర్తిగా క్రుంగిపోయారు. తలనెప్పి తగ్గితేనేకాని, ఆమె జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టలేరు. వారి తల్లిదండ్రులిద్దరి పరివారాలలోనూ కాన్సర్ వ్యాధి ఉందని కూడా తెలిసింది.
పీరియడ్స్ లో ఆమెలో వ్యక్తమయ్యే భౌతిక లక్షణాలకు మొదట చాలా జాగ్రతగా ఎంపిక చేసిన మందులను ఇచ్చాము. రెండునెలల్లో వారికి తలనెప్పి తీవ్రత, వాటి వ్యవధి తగ్గింది. తరువాత తరువాత వారు వచ్చినపుడు తెలుసుకున్న ఆమె వ్యక్తిత్వ లక్షణాలు, కొన్ని విచిత్రమైన అలవాట్లు, వారి కుటుంబ పరమైన విషయాలు మొదలైన వాటివల్ల మాకు వారి భౌతిక, మానసిక స్థితి అవగతమయింది. దాని ప్రకారంగా మేము మందులని మార్చి "కాంస్టిట్యూషనల్ డ్రగ్" ఇచ్చాము. అయిదవ నెల వచ్చేసరికి పీరియిడ్స్ లో పూర్వపు బాధ కాని, అటువంటి లక్షణాలు కాని ఏమీ లేవని చాలా ప్రశాంతంగా, స్థిమితంగా ఉన్నానని, జీవితాన్ని సరి దిద్దుకోడానికి కొన్ని ప్లాన్స్ చేసుకున్నానని, వాటిని అమలులో పెట్టబోతున్నానిని చాలా సంతోషంగా తెలిపారు. మేము వారినింక మందులు ఆపవలసిందిగా చెప్పాము. ఒక సంవత్సరం తర్వాత మాకు ఫోన్ చేసి, చాలా బాగా ఉన్నానని, "మధ్యలో ఒక్కసారి పీరియడ్స్ ప్రారంభంలో కొద్దిగా తలనెప్పి వస్తే దానంతట అదే తగ్గిపోతుంది" అని అనుకున్నాక నిజంగానే ఏ మందులు లేకుండానే తగ్గిపోయిందని చెప్పారు.
మా వద్దకు ఇలాంటి మైగ్రేన్ కేసులు చాలా వస్తుంటాయి. తలనెప్పి ఉధృతంగా రావడానికి ఆహార పరమైన [గోధుమకు సంబంధించిన వంటకాలు, పాలు, తీపి పదార్థాలు, కొన్ని కూరగాయలు], వాతావరణ పరమైన [ఎక్కువగా ఎండలో గడపాల్సి రావడం, వేసవికాలం, చలికాలం లేదా వర్షాకాలం, వసంతం, ఋతువులు మారుతున్న స్థితులలో], మానసిక ఒత్తిడి [పరీక్షల ముందు, జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలు - ఉదా: విడాకులు తీసుకుంటున్నపుడు, తీసుకున్నాక, కుటుంబంలోని ఒక వ్యక్తి మరణం, వ్యాధిగ్రస్తుల సేవ చేయాల్సి రావడం, ఉద్యోగాలు మారినపుదు, బొత్తిగా మనస్తత్వం కలవని వాళ్ళ మధ్య ఉండాల్సి వచ్చినపుడు, స్థలం మార్పు మొదలైనవి], లేదా జీవితంలో ఏదో ఒక మార్పు [ఆడవారికి పీరియడ్స్ మొదలవడం, పీరియడ్స్ కి ముందు, పీరియడ్స్ లో, తర్వాత, మెనోపాజ్, పీరియడ్స్ ఆగిపోతున్నపుడు, ఆగిపోయాక] కారణాలుంటాయి.
అసలు మూలకారణం అర్థం చేసుకోవడానికి ప్రతి సూక్ష్మాంశాన్ని అడిగి తెలుసుకుంటాము. ఈ రకంగా పేషెంట్స్, మేము పరస్పర అభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటుంటాము.
పిల్లలకు హోమియోపతి
పిల్లలకు హోమియోపతి వైద్యము చాలా సురక్షితమైనదనే అభిప్రాయం రోజురోజుకి దృఢమవుతున్నది. వాస్తవం కూడా అదే. విశేషించి "ఎరుగుదల" విషయంలో, అంటే, పళ్ళు, నడక, మాటలు ఆలస్యంగా రావడం, కొద్దిగా కూడ లావు అవకపోవడం, బరువు పెరగడం లాంటివి, వ్యాధి నిరోధకశక్తి (ఇమ్మ్యునిటీ) చాలా తక్కువగా ఉండటం [తరచుగా జలుబు, దగ్గు, శ్వాసకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం, ఆహారంలో చాలా వస్తువులు పడక పోవడం౦ ఇలాంటి వాటికి హోమియోపతి వైద్యం శ్రేష్ఠతరమని విశ్వసిస్తున్నారు. ఇలాంటి కేసులలో మేము చాలా మంది పిల్లల ఎదుగుదలకు సహజమైన చికిత్సా పద్ధతిలో తోడ్పడ్డాము.
డైయేరియా : రెండేళ్ళ వయసు నుండి ప్రారంభమై, పాపకు మూడో సంవత్సరం గడుస్తుండగా, తరచుగా నీళ్ళు విరేచనాలవుతాయి. ఒక మూడేళ్ళ పాపను మావద్దకు తెచ్చారు. నిండు నెలలు గడిచాక, మామూలు ప్రసవంలోనే ఆ పాప జన్మించింది. టీకాలు అవి ఇచ్చాక, జ్వరం, విరేచనాలు, బరువు తగ్గడం లాంటివి ఏవీ జరగలేదు. ఆ పాప తల్లి పాలతోనే పెరిగింది, పళ్ళు, నడక, మాటలు అన్నీ సక్రమంగానే వచ్చాయి. ఏ పదార్థాన్ని తింటే మోషన్స్ అవుతున్నాయో తల్లిదండ్రులు నిర్ధారించలేక పోయారు. ఆకలి దప్పులు అన్ని మామూలుగానే ఉన్నాయి కాని ఊరగాయలు, పులుపు పళ్ళు, పులుపు రుచి ఎక్కువగా ఇష్ట పడుతుంది. తిన్నవెంటనే విరేచనం. బరువు పెరగలేదు. స్టూల్ టెస్ట్ చేస్తే వార్మ్స్ లేవు కాని పాపకు ఐరన్ చాలా తక్కువగా ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే అంత సన్నగా ఉండి కూడా ఆ పాప చాలా చలాకీగా, చురుగ్గా ఉంది. ప్లే స్కూల్లో చాలా చురుగ్గా ఉంటుందని గుర్తింపు ఉంది. దుప్పటి కప్పితే తన్నేస్తుంది. చలికాలంలో కూడా కిటికీలు తెరిచే ఉంచాలి. నిద్ర పోయేటపుడు ఎంత చెమట పోస్తుందంటే తలగడ అంతా తడిసిపోతుంది. నిద్రలో కూడా చాలా రెస్ట్ లెస్ గా ఉండి, అటు ఇటు దొర్లుతూ, పొద్దున లేచే సరికి పక్క అంతా నానా గందరగోళంగా ఉంటుంది.
పులుపు రుచి కోసం ప్రాకులాడటం, గాలి, వెలుతురు బాహాటంగా కావల్సి ఉండటం మొదలగు భౌతికంగా కనిపిస్తున్న సాధారణ లక్షణాలనాధారంగా మా మొదటి చికిత్స ప్రారంభించాము.
మూడు నాలుగు వారాలలో నీళ్ళ విరేచనాలు అంత తరచుగా కాకపోవడం, కొద్దిగా బరువు పెరగడం మొదలయింది. కాని చిన్నతనంలో ఆ పాపకి ఉన్న "చెస్ట్ ప్రాబ్లమ్స్" - త్వరగా జలుబు చేయడం, దగ్గు అందులోనూ రాత్రిపూట పొడి దగ్గు ఎక్కువగా ఉండటం లాంటి లక్షణాలు మళ్ళీ కనిపిస్తున్నాయని తల్లితండ్రులు చెప్పారు.
క్రొత్తగా తెలిసిన ఈ సింప్టమ్స్‌ని ఆధారం చేసుకొని మేము రెండవసారి మందులనిచ్చాము. పది రోజులలో చెస్ట్ ప్రాబ్లమ్స్, దగ్గు పూర్తిగా తగ్గిపోయాయి. త్వరగా జలుబు చేసే గుణం తగ్గింది. ఆకలి పెరిగింది. అన్నిటి కంటే ముఖ్యమైన మార్పేమిటంటే హోమియో మొదలు పెట్టాక పాపకి రాత్రుళ్ళు బొత్తిగా చెమట పోయడం లేదు. చక్కటి గాఢ నిద్ర. మూడు నెలల తర్వాత వాళ్ళ కుటుంబ విషయాలనాధారంగా చేసుకొని "కాన్‍స్టిట్యూషనల్ డ్రగ్" ఇచ్చాక ఇకపై మందులు అవసరం లేదని చెప్పాము.
హెమోఫిలియాక్స్ - రక్తస్రావంలో అవక తవకలు.
బ్యాంక్ లో టెల్లర్ లా పనిచేసే 28 ఏళ్ళ వ్యక్తి చిన్నప్పటి నుండి కూడా చివుళ్ళనుండి రక్త స్రావము జరుకుతుంటుందని, కాని నెప్పి ఉండదనే ఫిర్యాదుతో మా వద్దకు వచ్చారు. అతనికి పదమూడు, పధ్నాలుగు సంవత్సరాలు వచ్చేంతవరకు వాళ్ళ కుటుంబం గ్రామంలో ఉండటం వల్ల పెద్దగా వైద్యం అదీ చేయించలేక పోయారు. చిన్నప్పుదు వారికి ఏవైనా దెబ్బలు తగిలితే చాలా రోజుల వరకు నయమయేవి కావని, అందుకనే తల్లిదండ్రులు స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి పంపేవారు కాదని చెప్పారు. 24 సం లప్పుడు, మోటారు సైకిల్ యాక్సిడెంట్ లో తలకి దెబ్బ తగిలింది. స్పృహలేని పరిస్థితిలో దగ్గర్లో ఉన్న పట్టణంలోని చికిత్సాలయానికి తీసుకొని వెళ్ళారు. రక్తం ఎక్కించి మిగిలిన టెస్ట్లన్నీ చేసారు. డయాబిటీస్ లేదు. బ్లడ్ టెస్ట్ వల్ల రక్తం గడ్డ కట్టడానికి, రక్తస్రావం ఆగడానికి అలస్యమవుతుందని తేలింది. ఫాక్టర్ 8 అంటే క్లాట్టింగ్ ఫాక్టర్ తక్కువగా ఉంది. అతనికి హెమోఫిలియాక్స్ ఉందని, బ్రతికి ఉన్నంతకాలం వేసుకోవాలని స్టెరాయిడ్స్ వ్రాసి ఇచ్చారు. ఎపుడు వారికి సీరియస్ దెబ్బలు తగిలినా, మెడికల్ టెస్ట్ లలో "ఏంటీకోయాగులెంట్" ప్రిస్ క్రిప్ షన్ ఇచ్చేవారు.
బ్లడ్ క్లాట్ యాంటీకోయాగులెంట్ కి సంబంధించిన వ్యాధినరికట్టడానికి హోమియోపతిలో మంచి మందులు, చికిత్స ఉన్నదని విన్న వారి ఫామిలీ డాక్టరే మా పేరు చెప్పి వారిని మావద్దకు పంపారు.
మేము వారిని ప్రశ్నలడగడం మొదలుపెట్టాక వ్యక్తిత్వంలో ప్రత్యేక లక్షణాలేమీ కన్పించలేదు. ఆఁ! వారికలలు ఫామిలీ హిస్టరీలో కూడా మావైద్యానికి పనికి వచ్చే ఆసక్తికరమైన విషయాలేమీ లేవు. ఈ చికిత్సకు, వారి ఇంటి విషయాలకు ఎటువంటి సంబంధము లేదు అనే భావనలో మొదట్లో ఇంటి విషయాలు మాతో మాట్లాడడానికే వారు ఇష్టపడలేదు. మేము తరచి తరచి అడుగుతుంటే వారు ఆశ్చర్య పడ్డారు.
చిన్నప్పటినుండి వారికి అవే అవే కలలు వస్తుంటాయి. వారు పెద్దగా అయినా కూడా కలల సారాంశంలో పెద్దగా మార్పేమీ లేదు. ఈ కలల గురించి వారి అమ్మగారి తోను, స్నేహితులతోను ముచ్చటించేవారు.
వారికి ముందే మేము చికిత్సకు ఎక్కువ కాలం పట్టవచ్చని స్పష్టంగా తెలియజేశాము. తక్కువ పొటెన్సీతో మందులు మొదలు పెట్టి వారం వారం రావలసిందిగా కోరాము. రెండవ వారాంతంలో ఆయనలో ఫిర్యాదులలో చెప్పుకోదగ్గ మార్పేమీ రాకపోవడంతో మేము వారి ఫిర్యాదులను మళ్ళీ సమీక్షించి, వారి కలల సారాంశాన్ని ఆధారంగా చేసుకొని, మందులను మార్చాము. తర్వాత రెండు మూడు వారాల్లో కూడా ఏమీ మార్పు లేక పోవడంతో మందు పొటెన్సీ పెంచాము. ఒక్క వారంలో అతనికి చివుళ్ళనుండి రక్తం రావడం ఆగి పోయింది. పొద్దున్నే లేచి అద్దంలో చూసుకుంటే పళ్ళలో రక్తపు మరకలు లేవు. [ప్రతి రోజులా]. తర్వాత రెండు వారాలు అదే మందు కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసాము. వారి వ్యాధిలో వచ్చిన మార్పు, "చివుళ్ళలోని రక్తస్రావం ఆగిపోవడం" కంటిన్యూ అయింది.
రక్త పరీక్ష చేయించాక రక్త స్రావము, గడ్డ కట్టే సమయము అలాగే ఆలస్యంగానే ఉన్నాయని, ఫాక్టర్ 8 లేదని తేలింది.
మందులను మార్చాము. ఆరు నెలల తర్వాత, వారిలో వచ్చిన మంచి మార్పులు అలాగే నిలిచి ఉండాలనే ఉద్దేశ్యంతో కొంచెం స్ట్రాంగ్ మందులివ్వడానికి నిర్ణయించుకున్నాము.
చివుళ్ళనుండి రక్తస్రావం అస్సలే లేదు. దెబ్బలు గట్రా తగిలినా త్వరగా నయమవుతున్నాయి. సంవత్సరాంతంలో మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయిస్తే క్లాట్టింగ్ టైంలో చెప్పుకోదగ్గ మార్పు ఉన్నా సాధారణ వ్యక్తికి ఉండే నిష్పత్తిలో లేవు. ఫాక్టర్ 8 కూడా లేదు. ఒక సంవత్సరం తర్వాత మెల్లగా మందులు తగ్గించి, మూడు నెలల తర్వాత పూర్తిగా మందులను ఆపించాము. మందుల కోసం అడపాతడపా వస్తుంటారు. ఈ విధంగా హెమోఫిలియాక్స్ చికిత్సలో మేము చాలా వరకు కృతార్థులమయ్యాము.
హోమియోపతి చికిత్సా విధానం భౌతికంగా కన్పిస్తున్న లక్షణాలను రక్తస్రావం, డయేరియా, రాష్ మొదలైనవి అరికట్టడానికి కాకుండా, వారి మానసిక గుణాలను (కలలు, మూడ్స్, స్వభావం, కోరికలు, అసహ్యాలు) పరీక్షించి, ఇటువంటి లక్షణాలే (ఎలర్జీ, రాష్, ఆస్తమా మొ) ఉండి వ్యాధితో బాధ పడుతున్న వేరొక వ్యక్తి నుండి భిన్నంగా ఉంటే మూర్తిత్వ వ్యక్తిత్వ లక్షణాలనాధారంగా చికిత్సనివ్వడం జరుగుతుంది. (భౌతికంగా వ్యాధి ఇదే కావచ్చు, కాని మానసిక భావాలు, లక్షణాలు ఏ ఇద్దరు వ్యక్తులకు ఒకే విధంగా ఉండవు). దురదృష్ట వశాత్తు దీన్ని "విజ్ఞాన శాస్త్రం"గా అంగీకరించడం జరగడం లేదు. ఎందుకంటే చాలామందిలో శారీరికంగా ప్రస్ఫుటంగా కన్పించే సామాన్య చిహ్నాలు, లక్షణాలు ఆయా వ్యాధుల లక్షణాలు గా అధునాతన వైద్య శాస్త్రము నిర్ధారిస్తున్నది. స్వస్థత చేకూరడంలో ఆ వ్యక్తి భౌతిక, మానసిక లక్షణాలలో చక్కటి పరివర్తన వస్తుందన్న విషయమే అధునాతన వైద్యం పట్టించుకోవడం లేదు. కాని ఈ పరివర్తనలే హోమియోపతి చికిత్సకు మూలస్తంభాల్లాంటివి.
ఈ డాక్టర్లు చికిత్స చేసిన ఇతర వ్యాధులు:
చర్మసమస్యలు : Psoriasis, skin allergy
రుమాటిక్ జ్వారాలు
ఎలర్జీలు
ఆస్తమా
సైకోసొమాటిక్ వ్యాధులు [ఇర్రిటబుల్ బవల్ సిండ్రోమ్ - ఇది ప్రేగులకు సంబంధించిన సమస్య. కడుపునెప్పి, కడుపులో కొంకర్లు, బవల్స్ ఫ్రీ అవటంలో ఎక్స్‌ట్రీమిటీస్ - అయితే మలబద్ధకం లేదా విరేచనాలు. మెడికల్ ఎన్‌సైక్లోపేడియాలో ఈ వ్యాధిని వివరిస్తూ IBS లక్షణాలను తగ్గించవచ్చు కాని దీనికి చికిత్స లేదు అని స్పష్టంగా వ్రాసి ఉంది. ఇలాంటి దానికి కూడా వీరు హోమియోద్వారా చికిత్స చేసారు]
రుమెటొలాజికల్ సమస్యలు [ సర్వికల్ స్పాండిలైటీస్, ఆర్థ్‌రైటిస్, ఆస్టియో ఆర్థ్‌రైటిస్, ఇన్‌ఫెక్టివ్ ఆర్థ్‌రైటిస్]
రుమాటిక్ కీళ్ళనెప్పులు:
28 సంవత్సరాల అమెరికన్ సాఫ్‌ట్‌వేర్ ఇంజినీర్ చాలాకాలంగా గొంతంతా పచ్చిపుండులా ఉంటున్నదని, ఏదైనా మింగేటపుడు నెప్పి వస్తుందని, గోరు వెచ్చగా ఏదైనా తిన్నా తాగినా అంతగా నెప్పి ఉండదని చెప్పారు. "Throat Swab" టెస్ట్ వల్ల స్ట్రెప్టో కాక్టస్ ఇన్‌ఫెక్షన్ ఉందని తేలింది. దానికి యాంటిబయాటిక్స్ ప్రిస్‌క్రైబ్ చేసారు డాక్టర్లు. దానివల్ల కొద్దిగా ఉపశమనం ఉండేది. రెండు సంవత్సరాల నుండి ఇది అలా కొనసాగుతూ ఉంది. మెల్లగా అతనికి చేతుల, పాదాల జాయింట్లలో రుమాటిక్ నెప్పి రావడం మొదలయింది. ఎక్స్‌రేలు, మిగిలిన రిపోర్టులు అన్ని నార్మల్ గానే ఉన్నాయి. అతను వేసుకుంటున్నయాంటీబయాటిక్స్‌తో పాటు ఇపుడు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీనితో అతనికి నీళ్ళ విరేచనాలు, మందులు వేసుకున్నాక కడుపు ఎప్పుడూ ఉబ్బరంగా ఉండటం లాంటి గాస్ట్రిక్ సమస్యలు తలయెతాయి. మా పేషంట్, వారి స్నేహితులు, వారికి నచ్చచెప్పడం వల్ల హోమియోపతి మందులు వాడి చూద్దామని నిశ్చయించుకున్నారు. ఆన్‌లైన్ మా ప్రశ్నావళి నింపి పంపారు. మేము కూడా చికిత్స ఎంత కాలం పడుతుంది, ఆహార నియమాలు ఏంటి మొ|| వారి సందేహాలకు జవాబులిచ్చాము.
వారు చిన్నతనంలో తీసుకున్న చికిత్సలు, టీకాలు, వాటి ఫలితాలు మాకు ఈ కేసుకి చాలా సహాయకారిగా ఉన్నాయి. డి.పి.టి. టీకాలు తీసుకున్నాక వారికి చాలా హై ఫీవర్ వచ్చిందని, దాని తర్వాత వారెప్పుడూ నలతగానే ఉండేవారని వారి అమ్మగారు చెప్తుండేవారట. ఇంతే కాకుండా, జ్వరంతో పాటు ఫిట్స్ కూడా రావడంతో హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. చాలా చిక్కిపోయి అప్పటినుండి రోగిష్ఠి పిల్లవాడిలా అయి, ఎప్పుడూ ముక్కు కారడం, బలహీనమైన ఛెస్ట్‌తో బాధపడేవారట. మిగతా మైలురాళ్ళు, పళ్ళు, మాటలు, నడక వగైరా అన్నీ మామూలే. మొట్టమొదటగా మేము "మింగడంలో అతను పడే బాధ" ని తగ్గించడానికి మందులు ఇవ్వడం ప్రారంభించాము. రెండు వారాలు మందులు తీసుకున్నాక అతనికి "ప్రస్ఫుటమైన మార్పు" కనిపించింది. ఆహార పదార్థాలను, పానీయాలను సాధారణంగానే తిని, తాగ గలుగుతున్నానని చాలా ఉత్సాహంగా ఉన్నానని ఫీడ్‌బాక్ ఇస్తూ తనను చలాకీగా చేయడానికి ఏమైనా మందులిచ్చి ఉండవచ్చని తను భావించినట్లు కూడా చెప్పారు. ఎటువంటి దుష్పలితాలు లేవు. కాకపోతే జాయింట్ నెప్పులు అలాగే ఉండటంవల్ల దానికి మెడిసిన్ కావాలని అడిగారు.
వారు పూర్తిగా యాంటీ బయాటిక్స్ మానేశారు. పెయిన్ కిల్లర్స్ కూడా పూర్తికా మానేయాలని వారి కోరిక. చికిత్స ప్రారంభించిన మూడవ వారంలో మేము మందులను మార్చి కీళ్ళ నెప్పులకు కూడా మందులివ్వడానికి నిర్ధారించుకున్నాము. ఆరు వారాల చికిత్స తర్వాత గొంతు నెప్పి పూర్తిగా మటు మాయమయిందని, కీళ్ళ నెప్పులే ఇంకా సతాయిస్తున్నాయని చెప్పారు. మళ్ళీ మారిన ఈ లక్షణాలను - ఒకటి ఎక్కువయింది, మరొకటి పూర్తిగా తగ్గింది, దృష్టిలో ఉంచుకొని మందు మార్చాము. ఈ సారి అతనిలో కొట్ట వచ్చిన మార్పు కన్పించి పోయినసారి ఇచ్చిన మందు కంటె ఈ సారి మందు చాలా బాగా పని చేసిందని చెప్పారు. ఈ మందునే మరొక నాలుగు వారాలు చలికాలం మొదలయ్యేంత వరకు కంటిన్యూ చేశాము.
కాని చలికాలం రావడంతోనే అతని నెప్పులన్నీ ఉదృతమయ్యే సరికి చాలా నిస్పృహ చెంది మళ్ళీ పెయిన్ కిల్లర్స్ మొదలు పెట్టాల్సి వస్తుందేమోనన్న బాధ వ్యక్తం చేశారు. మేము మళ్ళీ ప్రిస్‌క్రిప్షన్ మార్చి, ఈ సారి ఎక్కువ పొటెన్సీ మందులిచ్చి రెండు రోజులకొక సారి ఈమెయిల్ ద్వారా ఎలా ఉందో చెప్పమని కోరాము. వారు మామాటలను తు.చ. తప్పకుండా పాటించారు. ఒక్క వారంలో నెప్పులు చాలా వరకూ తగ్గాయని చెప్పారు. పరిస్థితి మెరుగు అవుతూనే ఉంది. చాలా సంవత్సరాల తర్వాత పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్ లేకుండా ముఖ్యంగా నెప్పులు గట్రా లేకుండా వారు క్రిస్ట్‌మస్ పండుగ జరుపుకున్నారు. ఆరోగ్య పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు రావడంలో స్ప్రింగ్ సీజన్ రాగానే ఇక మందులు ఆపివేయచ్చని తెలిపాము. కాని వారు చాలా భయపడ్డారు మందులనాపడానికి. మేము రెండు వారాల పాటు ఏ మందులు లేకుండా ఉండి చూడమని నచ్చచెప్పాము. SOS మందు ఒకటి పంపి, ఒక వేళ కీళ్ళ నెప్పులు ఉధృతంగా ఉంటేనే తీసుకోమని చెప్పాము. చాలా అరుదుగా ఆ మందు వాడానని ఇపుడు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలియ చేశారు.
హోమియోపతి వైద్య విధానం ప్రకారం మేము జీవితంలోని సంఘటనలు, ఒక ప్రత్యేకమైన వ్యాధికి ఎక్కువ, తక్కువ అయ్యే ఫాక్టర్స్, సెన్సిటివిటీస్ (ఆహారం, వాతావరణం, ఒత్తిడి మొ|| ), వారి కుటుంబ చరిత్ర ఇవన్నీ తెలుసుకుంటేనే కాని టంకం పొడి లాంటి మందు ఇవ్వలేము. పైన చెప్పిన ఫాక్టర్ల వల్ల ఎప్పుడెప్పుడు వ్యాధి లక్షణాలు మారుతాయో మేము దానికణుగుణంగా మందులను మారుస్తాము. ఒక్క సారి స్వస్థత చేకూరాక మందులను అలా వేసుకుంటూ ఉండడం మాకు నచ్చదు. ఎందుకంటే సిస్టమ్ మళ్ళీ చక్కగా పట్టాల మీదకు వచ్చింది కదా! మెడిసిన్స్ ద్వారా సిస్టమ్‌ని, కిక్ స్టార్ట్ చేస్తే, ఒక్కసారి శరీరం పూర్తిగా స్వస్థతను పొందితే ఇంక ఏ చికిత్సా లేకుండా శరీరాన్ని మామూలు స్థితికి రానివ్వాలని మా అభిప్రాయం.
ప్రాణాంతక వ్యాధులు
తరుచుగా మమ్మల్ని డాక్టర్లు, పేషెంట్లు కూడా కాన్సర్‌లాంటి వ్యాధులకు హోమియోపతిలో మందులున్నాయా? అని అడుగుతుంటారు. రోగిని చూసి పరిస్థితిని అందాజా చేస్తేకాని చెప్పలేమని మేము (అసంతృప్తికరమైన) జవాబిస్తుంటాము. కాన్సర్‌ని మేము క్యూర్‌చేసామంటూ మేము చెప్పుకోముకాని, ప్రతి కేసుని చాలా జాగ్రత్తగా చూస్తాం. రోగికి కాని, వారి సంబంధీకులకు గాని లేనిపోని ఆశలు కల్పించము. చాలామటుకు రేడియేషన్స్, ఖెమోథెరపీ అయ్యాక కేసులు మా దగ్గరకి వస్తాయి. కాబట్టి సహజంగా వాళ్ళలో యీ రెండు చికిత్సలవల్ల వచ్చిన లక్షణాలే (డయేరియా, చాలా నీరసం, ఎముకల నెప్పులు, వాంతులు, మింగలేకపోవడం, వికారం, రాష్ మొదలైనవి కన్పిస్తాయి. ఇటువంటి బాధలు కొద్దిగా తగ్గితే చాలనే పరిస్థితిలో ఉంటారు వారు.
చాలాసార్లు కేసులను మాకు రిఫర్ చేసిన ఆన్‌కాలజిస్టులతో (కాన్సర్లకు, ట్యూమర్లకు చికిత్స చేసే డాక్టర్లు) కలిసి చికిత్స చేస్తుంటాము. హోమియోపతి మందులను వారికోసం వ్రాస్తున్నపుడు, ఖెమోతో పాటు వీటిని కూడా ఉపయోగించమని ఇచ్చినపుడు మాకు మిక్స్‌డ్ ఫలితాలు వచ్చాయి. కొంతమందికి ఎంత బాగా నయమయ్యిందంటే వాళ్ళూ వారిని చూసే డాక్టర్ల సలహా మేరకు రెగ్యులర్‌గా తీసుకునే మందులను మానేశారు. పూర్తిగా హోమియోపతి మందులనే వాడుతున్నారు. మరి కొంతమంది వాళ్ళ రెగ్యులర్ మందులతో పాటు వీటిని కూడా ఉపయోగిస్తున్నారు. కాని కొంతమందికి ఈ మందులేమీ ఫలితం చూపలేదు.
సాధారణ కేసులను ఎలా చికిత్స చేస్తామో ఈ ప్రాణాంతక కేసులను కూడా అలాగే చూస్తాము. ఆ వ్యక్తితోనూ, అతని ఆలనా-పాలనా చూస్తున్న వ్యక్తులతోను చాలా సార్లు కౌన్సెలింగ్ జరిగాక, సున్నితంగా పనిచేసే ఈ చికిత్సా విధానాన్ని వివరించి వారి అంగీకారం తీసుకున్న తరువాత వైద్యం మొదలు పెడతాము. ఇలాంటి కేసుల విషయాలలో బాధను తగ్గించడం, ఆకలి పెంచడం, సరిగా జీర్ణమయేలా చేయడం, రేడియేషన్, ఖెమోల దుష్పలితాలను తగ్గించడం మా ప్రధాన లక్ష్యం. ఈ వ్యాధులకి కూడా ఆ రోకి యొక్క వ్యక్తిత్వ-మూర్తిత్వ లక్షణాలు, గుణాలను పరిశీలించడం జరుగుతుంది.