ప్రశ్నావళి మీ దగ్గర్నుండి వచ్చాక మేము ఎంతవరకు సహాయం చేయగలమనేది నిర్ధారించుకుంటాము. మేము, పేషెంట్ ఇద్దరం ఒక్కసారి చికిత్సకు సరే అనుకున్నాక, చికిత్సా ప్రణాళిక - ఎంతకాలం? ఏం మందులు? ఎలా తీసుకోవాలి? ఆహార నియమాలేంటి? పేమెంట్ పద్ధతి ఇవన్నీ చర్చిస్తాము. "తరచుగా అడిగే ప్రశ్నల" లో లేని ప్రశ్నలు / సందేహాలు మీకుంటే నిరభ్యంతరంగా అడగవచ్చు.
ఇంటర్‌నెట్ ద్వారా ఎంతవరకు సాధ్యం? చికిత్సను ప్రారంభించడానికి అనుసరించే పద్ధతి ఏమిటి?
మీ ఆరోగ్యం దృష్ట్యా మీరు హోమియోపతి చికిత్స తీసుకోవాలన్న అభిలాష ఉంటే మీరు మాకు మీ సమస్య గురించి, మీరు తీసుకుంటున్న చికిత్స గురించి వ్రాయండి. మీరిచ్చిన ప్రాధమిక వివరాలు చదివాక మేము మిమ్మల్ని సంప్రదిస్తాము. మీకు మేము వైద్య సహాయం చేయగలమనుకుంటే మీకొక కాల వ్యవధినిచ్చి, ఈ సమయంలోగా మీరే మీలో వచ్చే మార్పులను గమనించగల్గుతారని హామీ ఇస్తాము. తర్వాత మీరు ప్రశ్నావళి నింపి పంపాలి.
ఫీజు - ఇచ్చే పద్ధతి :
ఉభయ పక్షాలు ఒప్పుకున్నాక, చికిత్స ప్రారంభించే ముందు మీకు తెలియచేస్తాము.