తరచుగా అడిగే ప్రశ్నలు

homeopathic treatment    homeopathy treatment


"We believe in the human body's innate ability to overcome disease by itself. Our role is to understand the causes and set the natural pattern right in the least harmful and the most natural way"

Dr. Anil Nanduri


హోమియోపతి దేనికి చికిత్స నివ్వగలుగుతుంది?
కాన్సర్, ఆర్థ్‌రైటిస్, ట్యూమర్స్, క్రానిక్ ఎలర్జీస్, చర్మవ్యాధులు, ఇపుడు కొత్తగా SARS, వీటిని తగ్గించడానికి హోమియోపతిలో మందులున్నాయా? అని సర్వసాధారణంగా అందరూ మమ్మల్ని అడుగుతుంటారు. జవాబు చిన్నగానూ, స్పష్టంగానూ చెప్పలేము.

శాస్త్రీయ "హోమియోపతి" డాక్టర్ ఇలాంటి కొన్ని కేసులని పూర్తిగా నయం చేసి విజయం సాధించి ఉండవచ్చు. కొన్నింటిలో విఫలతని ఎదుర్కొని ఉండవచ్చు. సాధారణ వైద్య శాస్త్రము, లేదా ఎల్లోపతి లాగానే దీనికి కూడా కొన్ని పరిమెతులున్నాయి కాని, ఇది కూడా ఎల్లోపతిలాగానే సీరియస్, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులకు చక్కటి సఫలతతో చికిత్స చేస్తున్న వైద్య విజ్ఞానశాస్త్రమే. సాధారణంగా అందరూ అభిప్రాయ పడుతున్నట్లు హోమియోపతి వైద్యం కేవలం దీర్ఘకాలిక్, క్రానిక్ వ్యాధులకు మాత్రమే పరిమితమం కాదు. ఎక్యూట్ కేసులు (ఋతువులు మారడంవల్ల వచ్చే జ్వరాలు మొ||, బాల్యంలోని అస్వస్థతలు, దెబ్బలు మొ||) క్రానిక్, ప్రాణాంతక కేసులకు కూడా చికిత్సను చేయగల్గుతుంది. పాలియేటివ్ చికిత్సను కూడా అందిస్తుంది.

హోమియోపతి - పూర్ణతా దృక్పధం
హోమియోపతి వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిత్వానికి ప్రాధాన్యతనిస్తుంది. శాస్త్రీయ హోమియోపతి వైద్యులు మొదట రోగి నుండి వ్యాధికి సంబంధించిన చిన్నచిన్న విషయాలన్నింటినీ సేకరిస్తారు. ఇంతకు ముందు రోగి ఎవరివద్దనైనా చికిత్స తీసికొని ఉంటే ఆ రిపోర్టులన్నింటిని, ప్రిస్‌క్రైబ్ చేసిన మందులు, ఇంజెక్షన్లు మొ|| వి పరిశీలించి ఆ రోగికి హోమియో ఒక్కటే సరిపోతుంది, లేదా ఇతర మందులతోపాటు హోమియో తీసుకోవలసిందిగా సలహా ఇస్తాము.

తమ దృష్టిలో ముఖ్యమైన లక్షణాలు అనుకుంటున్నవి, దేనికైతే వాళ్ళు చికిత్స కావాలని ఎదురుచూస్తున్నారో ఆ లక్షణాలను తమ రెగ్యులర్ డాక్టర్లకు చెప్తున్నా అసలే పట్టించుకోరని తరచూ మా దగ్గర పేషెంట్లు వాపోతుంటారు. రెగ్యులర్ డాక్టర్స్ వ్యాధి నిర్ధారణ (ఇది ఇలాగే ఉండాలి) లే లక్ష్యంలా పెట్టుకొని, రోగులు చెప్తున్న భిన్నభిన్న ఫిర్యాదులపై శీతకన్ను వేస్తారు. (ఆ వ్యాధి నిర్ధారణా ప్రణాళికా మూసలో ఇవి రావడం లేదు కనుక) కాని హోమియోపతి వైద్య విధానము సాధారణ డాక్టర్లు అసలు జబ్బుకి, ఈ లక్షణాలకి ఎక్కడా సంబంధం లేదంటూ కొట్టి పారేసిన ఈ చిన్న చిన్న సింప్టమ్స్‌ని విని పరిశీలించి, అర్థం చేసుకొని, వాటిని సరిగా సమన్వయం చేసుకొని తగిన వైద్యవిధానం మొదలు పెడతారు. ఆ డాక్టరు ఆయా రోగుల లక్షణాలను, స్వభావాలను సరిగా అర్థం చేసుకొని సమన్వయించడంలోని హోమియోపతి వైద్యుల వృత్తి పరమైన విజయం ఆధారపడి ఉంది. క్రానిక్ వ్యాధులయినట్లయితే విస్తారమైన చర్చలు తర్వాత ఏ మందులు ఆరోగి స్వభావానికి అనువుగా ఉంటూ వ్యాధిని తగ్గించగల్గుతాయో చూసుకొని ఆ రకమైన మందులను వ్రాయడం జరుగుతుంది. అందువల్లనే హోమియోపతిని "చికిత్సాకళ" అని పిలవడంలో పెద్దగా ఆశ్చర్యపోవలసింది ఏం లేదు.

చికిత్సా విధానము - మెరుగుదల

కొత్తగా హోమియోపతి వైద్యానికి వచ్చే చాలా మంది పేషెంట్స్ ఈ విధానాన్ని చూసి కొంచెం (బాగానే) ఖంగు తింటారు. అర్జంట్ లక్షణాల్లాంటివి (నెప్పి, అసౌకర్యం, శారీరకంగా ఇబ్బందులు గట్రా) రోగి దృష్టిలో ముందుగా వాటికి చికిత్స చేయాలనుకునే లక్షణాలపై కాక చూడబోతే హోమియోపతి డాక్టర్కి రోగి యొక్క నిజజీవితం మీద ఎక్కువ (ఇబ్బంది పెట్టేంత) ఆసక్తి ఉన్నట్లు (రోగికి ఇవన్ని వ్యాధిలో బొత్తిగా తలా తోకా లేని ప్రశ్నల్లా అనిపిస్తాయి) వారికి అనిపిస్తుంది. ఏది ఏమైనా, వారెలా భావించినా ప్రతీ సూక్ష్మాంశ తెలిస్తే తప్ప సరియైన వైద్యాన్ని చేయలేము.

ఒకసారి కేసు పూర్తి వివరాలు సేకరించి, రెండు పక్షాల వారు ఓ.కే. అనుకున్నాక మందులను ఇవ్వడం అవి ఎలా వేసుకోవాలో తెలియజేయడం, ఆహార జాగ్రత్తలు (కేసుని బట్టి) మొ|| కూడా వివరించడం జరుగుతుంది. ఆ తరువాత అ వ్యక్తి వచ్చినప్పుడు ఫలానా ఫలానా లక్షణం (ణాలు) ఎలా ఉన్నాయి, వాటి తీవ్రతలో ఏదైనా మార్పు ఉందా? ఎంత తరచుగా వస్తున్నాయి, మామూలు ఆరోగ్యం [ఆకలి, నిద్ర, కడుపు ఖాళీ అవడం వగైరా] మామూలుగా ఉందా? లేదా? మొ|| తెలిసికొంటాము. కేసు చూస్తున్న డాక్టర్ ఈ విషయాలన్ని కొత్త లక్షణాలు (ణం) ఎంచి, వీటిని సరి చేయాల్సి ఉంటుంది. అందుకనే ఈ లక్షణ సంపుటికి అనుగుణంగా మందులను మార్చడం చేస్తారు. కాబట్టే రెండవసారి ఇచ్చే వైద్యం / చికిత్స ఈ కొత్త లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది - ఇదీ ఒక్కొక్క రోగికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ సారూప్యంగా ఉన్న రెండు కేసులలో కూడా ఇది వేర్వేరుగా ఉంటుంది. హోమియోపతిలో ఒక వ్యాధికి చికిత్సా పద్ధతిని నిర్ణయించడానికి నిర్ణీతమైన నియమాలు కాని నిబంధనలు కాని లేవు. అప్పటికప్పుడు రోగి సంపూర్ణ లక్షణాలను అర్థం చేసుకొని చికిత్సా విధానాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అప్పుడే అది సవ్యంగా పేషెంట్ ఫిర్యాదు చేసిన మార్పులకనుగుణంగా పని చేస్తుంది.

ఇది శాస్త్రీయమేనా?
చికిత్సావిధానానికి సిద్ధాంతాలను విధులను ప్రతిపాదిస్తున్నప్పుడు హోమియోపతి తత్త్వశాస్త్రము అన్ని రకాలైన వ్యాధులను పరిగణించింది. వ్యాధులను వర్గీకరణం చేయడానికి, వర్గీకరణం చేశాక ఇవ్వవలసిన చికిత్సా పద్ధతికి, ప్రిస్‌క్రిప్షన్ ఇవ్వడానికి గాని, మార్చడానికి గాని, చికిత్సావిధానంలో మార్పుదలకి, ఔషధాలను ఇచ్చాక లక్షణాల సమన్వయం చేయడానికి, మొదటిది తరువాత ప్రిస్‌క్రిప్షన్స్‌కి, ప్రాణాంతక వ్యాధులకు ప్రిస్‌క్రైబ్ చేయడానికి, వీటన్నింటికి కూడా చక్కటి రీతిలో స్పష్టమయిన నియమాలను ఏర్పరిచింది.

మానవశరీర నిర్మాణంలోని (వ్యాధి, గాయాలు మొ|| వాటిని) తనకు తానుగా స్వస్థత చేకూర్చుకొనే గుణానికి హోమియోపతి సిస్టమ్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. అందుకనే, రోగిలో కొంచం స్వస్థత మొదలయి, అది కంటిన్యూ అవుతున్న పక్షంలో మందులు ఇవ్వకుండా వారిలో అంతర్లీనంగా ఉన్న హీలింగ్ స్వభావానికి వదిలేయాలని హోమియోవైద్యులందరికి చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతున్న లక్షణాలు (శరీరంలోని సిస్టమ్స్ మళ్ళీ చక్కగా పని చేస్తున్నాయని సంకేతం) కన్పించిన వెంటనే మందులను ఆపేయాలని తత్త్వశాస్తం చెప్తుంది. హోమియోపతి పూర్తిగా ఒక విజ్ఞాన శాస్త్రమే. సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేసిన హోమియో వైద్యుల వృత్తి జీవితంలో హోమియో తత్త్వశాస్త్రంలో లేని వ్యాధి కాని, అందులో లేని (ఆయా వ్యాధులకు) చికిత్సావిధానం కాని, ఆదేశ నిషేధాలు కాని (do's & dont's) తటస్థ పడి ఉండవు.

నేను బి.పి., డయాబిటీస్, హార్ట్ సమస్యలకు మందులు తీసుకుంటున్నాను. హోమియో మందులు తీసుకుంటే కనక ఈ మందులు మానేయాలా?

అఖ్ఖర్లేదు. ఒకవేళ వేరే సమస్యలకు మీరలా మందులు తీసుకుంటున్నట్లైతే ఆ విషయం ఖచ్చితంగా హోమియో డాక్టర్‌కి చెప్పాలి. మీరు రెగ్యులర్‌గా తీసుకుంటున్న మందులతో పాటు హోమియో మందులెలా వాడాలన్నది డాక్టర్ సలహా ఇస్తారు.

నేను హోమియో మందులు వాడటం మొదలు పెట్టాగానే అకస్మాత్తుగా నా సమస్య ఎక్కువో, తీవ్రమో అయిందనుకోండి. అలాంటి పరిస్థితులలో వెంటనే నెమ్మదించడానికి ఎల్లోపతి మందులు వాడవచ్చా? తర్వాత తిరిగి హోమియోపతి మొదలు పెట్టవచ్చా?

మీకు వచ్చిన సమస్యను బట్టి, మీరు తీసుకుంటున్న హోమియో చికిత్సను బట్టి మొదట మీరు మీ హోమియో డాక్టరును సంప్రదించండి. మిగతా విషయాలు, ఏం చేయాలన్నది వారినే డిసైడ్ చేయనీయండి.

హోమియో మందులు తీసుకుంటున్నపుడు ఆహార నిషేధాలు చాలా ఉన్నాయా?

అలాంటిదీమీ లేదు. ఆహార నిషేధాలు మీకున్న వ్యాధిని బట్టి ఆ వ్యాధికిస్తున్న చికిత్సనుబట్టి ఆధారపడి ఉంటాయి. ఏది ఏమైనా ఒక ఆహార పదార్థం మీకు పడని పక్షంలో ఆ మాట మీ డాక్టర్ కు తెలపాలి.

ఏయే వ్యాధులను తగ్గించడంలో హోమియో విజయం సాధించింది?

మా అనుభవంలో మేము ఆర్థ్‌రైటిస్, చర్మవ్యాధులు, శ్వాసకు సంబంధించిన వ్యాధులు, మైగ్రేన్స్, బహిష్టుకు సంబంధించిన వ్యాధులు సంపూర్ణంగా నయం చేయ గలిగాం (మా దగ్గరకు వచ్చిన పేషెంట్లకు)

హోమియో ఎక్కడ వైఫల్యాన్ని పొందుతున్నది?

కాన్సర్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నపుడు, ఎయిడ్స్, హెపటైటిస్ సి, టి.బి. ముదిరిన స్టేజ్‌లో, సిఫిలిస్, గానోరీయా మొ|| వాటిలో హోమియో వైఫల్యాన్ని పొందుతుంది. కాని, ఈ కేసులలో కూడా హోమియోని పాలియేటివ్ (బాధని నెప్పులనీ తగ్గించే) చికిత్సలా ఉపయోగిస్తున్నారు.

హోమియో డాక్టర్లు వ్యక్తిగత ప్రశ్నలు - కలలు, మూడ్స్, సామాజిక ప్రవర్తన మొ|| ఎందుకు అడుగుతారు?

వ్యాధి నిర్ధారణ చేయడానికే. అంటే మీరు బాధ్ పడుతున్న లక్షణాలకు ఏదో ఒక వ్యాధి పేరు నిర్ధారించడం మా ఉద్దేశ్యం కాదు. ఒక వ్యక్తి కలలు, మూడ్స్, స్వభావం, ప్రవర్తన బట్టి కొన్ని మందులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి హోమియో మందులను ఇచ్చి పరీక్ష చేస్తారనే మాట నిజమేనా?

నిజమే, చక్కటి ఆరోగ్యంగా ఉన్న పురుషులకి, స్త్రీలకి కూడా మందులనిచ్చి, వాటి నాణ్యత (quality) తెలుసుకోవడం జరుగుతుంది. ఫలితాలను రికార్డ్ చేసి లక్షణాలన్నింటినీ సమీకరిస్తారు. వీటిని ఆధారంగా చేసుకొని హోమియో వైద్యులు పేషెంట్లకు ఏ మందు ఇవ్వాలన్నది నిర్ధారణ చేస్తారు.

హోమియోపతిని ప్లాసిబో మెడిసిన్ అని ఎందుకంటారు?

ఎక్కువ పొటెన్సీ ఉన్న హోమియో మందులలో అసలు ఉందో ? లేదో ? అన్నంత చిన్న మోతాదులలో మందు పదార్థాలను వాడటం జరుగుతుంది. అందుబాటులో ఉన్న ఏ విజ్ఞాన సాధనాలవల్ల కూడా దానిని తెలుసుకోవటం కష్టం. అటువంటి మందులను అతి సామాన్యమైన గణితపరమైన కొలమానాలతో తయారు చేస్తారు. హై పొటెన్సీలో మందు సూక్ష్మ పాళ్ళలో ఉండటం వల్ల దీన్ని కించపరుస్తూ ప్లాసిబో థెరపీ అని వ్యాఖ్యానిస్తారు.

మొదటిసారిగా హోమియో మందులు తీసుకున్నపుడు రోగికున్న ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువవుతాయని అందరి భావన. ఇది ఎంతవరకు నిజం?

రోగిలో కన్పిస్తున్న లక్షణాలు ఉధృతం అవడానిక్ బోలెడు కారణాలు ఉండవచ్చు. పెయిన్ కిల్లర్స్ మొదలైనవి తీసుకుంటున్న వ్యక్తులు ఆ మందులను తగ్గిస్తూ హోమియో మందులు వేసుకోవడం మొదలు పెట్టాగానే వారి సమస్యలు ఎక్కువయినట్లుగా భావిస్తారు. హోమియో డ్రగ్ వేశాక ఇటువంటి లక్షణం వచ్చినట్లయితే అది ఒక మంచి సంకేతమని హోమియో తత్త్వ శాస్త్రం అభిప్రాయపడుతుంది. హోమియో మందుల వల్ల లక్షణాలు ఉధృతమయిన పక్షంలో, దాని గురించె అంతగా పట్టించుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే అవి చాలా త్వరగా ఎలా వచ్చాయో అలాగే తగ్గిపోతాయి.

లాబొరేటరీ టెస్ట్‌లు హోమియో డాక్టర్లకి ఎంత వరకు ఉపయోగకరం?

ఆయా కేసులు హోమియో మందులకు స్పందిస్తాయా (రెస్పాన్డ్) లేదా నిర్ధారణ చేయడానికి, క్షుణ్ణంగా కేస్ టేకప్ చేశాక (ప్రశ్నోత్తరాలు, సూక్ష్మాంశలు పరిశీలించడం, కుటుంబ చరిత్ర మొ||) ఆ వ్యాధి ఎలా సంక్రమించి ఉండవచ్చనేది నిర్ధారణ చేయడానికి అవి ఉపయోగ పడతాయి.

గర్భిణీ స్త్రీలకు పిల్లలకు హోమియో మందుల వాడకం సురక్షితమేనా?

ఖచ్చితంగా సురక్షితమే. పిల్లలు చాలా త్వరగా హోమియో మందులకు రెస్పాండ్ అవుతారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి గర్భిణీ స్త్రీలు నిస్సందేహంగా ఈ మందులను వాడవచ్చు.




 

Homeopathic Treatment   |  About Homeopathy  |  About Us  |   FAQ  |  Articles & Links  |  Consultation  |   Contact Us  |  Blog