హోమియోపతి వైద్య విధానం, సర్టిఫికెట్

homeopathic treatment    homeopathy treatment


"We believe in the human body's innate ability to overcome disease by itself. Our role is to understand the causes and set the natural pattern right in the least harmful and the most natural way"

Dr. Anil Nanduri


భారతదేశంలో హోమియోపతి వైద్యవృత్తి, విద్యాసముపార్జన
ఒక వైద్య శాస్త్రానికి మరొకటి ప్రత్యామ్నాయంగాను, పూరకంగానూ, ఉండాలనీ, ప్రజలకు ఎంపిక చేసుకోవడానికి వీలుగా చాలా వైద్య విధానాలు ఉండాలనీ మన కేంద్ర ప్రభుత్వం అభిప్రాయ పడుతుండటం వల్ల హోమియోపతి వైద్య శాస్త్రానికి కూడా తదితర - ఆయుర్వేద, సిద్ధ, యునానీ వైద్యశాస్త్రాలతో సమానమైన సహయోగ సహకారాలను ప్రభుత్వం అందిస్తుంది.

హోమియోపతి వైద్య శాస్త్రంలో పరిశోధనలు, వృత్తి వీటిని గురించిన నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం "హోమియోపతి కేంద్ర మండలి" ని ఏర్పాటు చేసింది. విద్యారంగాలలోను, పరిశోధనా రంగాలలోనూ వృత్తిపరంగాను హోమియోపతి సిద్ధాంతాలను సమీక్షించి, హోమియో మందుల నాణ్యతను పర్యవేక్షించి అవసరమయితే కేంద్రప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది.

చాలామటుకు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ హోమియోపతి వైద్యశాలలను గ్రామాలలో నెలకొల్పాయి. పెద్ద పెద్ద నగరాలలో రోగులను హాస్పిటల్లోనే ఉంచి (in patient) వైద్యం చేసే సౌకర్యాలను కల్పించాయి.

భారతదేశం మొత్తంలో అండర్‌గ్రాడ్యుయేట్ వైద్య విద్యను అందిస్తున్నహోమియోపతి కళాశాలలు 128 ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రభుత్వ కళాశాలలయితే కొన్నిప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేట్ కళాశాలలు. విద్యార్థులు వైద్యశాస్త్రంలో పట్టభద్రులై బయటికి వస్తారు. అయితే ఇందులో 12 కళాశాలలు పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రదానం చేస్తాయి.

ఈ కళాశాలలో భర్తీ అవడానికి రాష్ట్ర ప్రభుత్వం జరిపే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. జీవశాస్త్రము, భౌతిక, రసాయన శాస్త్రాలు ప్రధాన విషయాలుగా ఉన్న ఉన్నత పాఠశాలలో ఉత్తీర్ణులయిన విద్యార్థులే ఈ ప్రవేశ పరీక్షకు అర్హులు.

ఎమ్. బి. బి. ఎస్., ఎమ్. డి. విద్యార్థులకు ఏ యే విషయాలు పాఠ్యప్రణాళికలో ఉంటాయో హోమియోపతి వైద్యశాస్త్రం చదివే వారికి కూడా అవే ఉంటాయి. 4 1/2 సంవత్సరాలు విద్యార్థులు శరీర నిర్మాణ శాస్త్రం (anatomy) శరీర ధర్మశాస్త్రం (physiology) సూక్ష్మ జీవశాస్త్రం (microbiology) నేర నిర్ణాయక వైద్య శాస్త్రం (forensic medicine) గైనకాలజీ, ఆబ్‌స్టెట్రిక్స్ (obstetrics - గర్భధారణ నుండి ప్రారంభించి ప్రసవం అయి తిరిగి స్వస్థత చేకూరే వరకు అవసరమయ్యే వైద్యం), నేత్ర వైద్య శాస్త్రం (opthalmology) చెవె, ముక్కు, గొంతు వైద్యం (ENT) , శస్త్ర చికిత్స (surgery) వ్యాధినిరోధక వైద్యం (preventive medicine) హోమియోపతి మందులు, వాటి తయారీ, రిపర్ టరీ మరియుహోమియో తత్త్వశాస్త్రం. రెండవ సంవత్సరంనుండి బెడ్ సైడ్ మెడిసిన్(రోగులను చూపిస్తూ వైద్యం నేర్పడం) నేర్చుకుంటారు, క్లినికల్ క్లాసులకి హాజరవుతారు. - ఆరు నెలల సెమిస్టర్ అయ్యాక కాని లేదా సంవత్సరాంతంలో కాని పరీక్షలు జరుగుతాయి. నాలుగున్నర సంవత్సరాల తర్వాత జరిగే ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి బి.హెచ్.ఎమ్.ఎస్. డిగ్రీ ప్రదానం చేస్తారు. ఒక్క సంవత్సరంపాటు వృత్తి పరమైన శిక్షణ (ఇన్‌టర్న్‌షిప్) జరిగాక ఆయా వైద్యులను గ్రామీణ చికిత్సాలయాలలో వాస్తవిక ప్రాపంచిక అనుభవం ఏర్పడటం కోసం నియమించడం జరుగుతుంది. ఇన్‌టర్న్‌షిప్ అయ్యాక డాక్టర్లు తమ పేర్లను స్టేట్ బోర్డ్ ఫర్ హోమియోపతిలో నమోదు చేయించుకుంటారు. దీనివల్ల వైద్యవృత్తి చేబట్టడానికి వారికి పరోక్షంగా లైసెన్స్ వచ్చినట్లే.

కొన్ని కొన్ని సంస్థలు నాలుగు సంవత్సరాల డిప్లొమా కోర్సులను నడుపుతున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులుకూడా ఉన్నాయి. రాష్త్ర ప్రభుత్వాలు మూడు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను నడుపుతున్నాయి. వీటికి కూడా ప్రవేశ పరీక్ష ఉంటుంది. విద్యార్థులకు(organon) హోమియో తత్వశాస్త్రం,(Homeopathic Materia Medica) ఔషధాల విజ్ఞానం, వాటి ఫలితాలు, రోగ నిర్ణాయక (pathology)శాస్త్రం, (reperatory) హోమియో ఔషధాలు వాటి నిఘంటువులు మొదలైన విషయాలలో పటుతరమైన శిక్షణన
ిస్తారు.




 

Homeopathic Treatment   |  About Homeopathy  |  About Us  |   FAQ  |  Articles & Links  |  Consultation  |   Contact Us  |  Blog