
"We believe in the human body's innate ability to overcome disease by itself. Our role is to understand the causes and set the natural pattern right in the least harmful and the most natural way"

Dr. Anil Nanduri |
|  |
ఇరవై శతాబ్దపు తొలి దశలో సమస్త రోగ నివారిణి లా పేరెన్నికగన్న అద్భుత ఔషధ రాజాలు యాంటీ బయాటిక్స్ వెలుగులోకి వచ్చాయి. అయితే మలి దశలోనే వీటి వల్ల దుష్ఫలితాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఉన్నాయని ప్రజలు తెలుసుకున్నారు. ఒక్కొక్కసారి అసలు ఉన్న వ్యాధికంటే కూడ యాంటీ బయాటిక్స్ ని ఉపయోగించడంవల్ల రోగి పరిస్థితి విషమిస్తున్నదని తెలిసాక నాటి వైద్యశాస్త్ర పరిశోధకులకు, వైద్యులకు వాటి గురించి ఉన్న భ్రమలు తొలగి పోయాయి. అందువల్ల చాలామంది ప్రత్యామ్నాయ ఔషధాలవైపు, అంతగా తెలియని దేశీయ వైద్య విధానంవైపు, అంటే అక్యుపంక్చర్, టిబెట్ మందులు, యోగ, ఆయుర్వేద, నాచురో్పతి, హెర్బల్ మెడిసిన్స్, హోమియోపతి వైపు మళ్ళారు, మళ్ళుతున్నారు.
ఈ దేశీయ వైద్యవిధానాలన్నీ ఎన్నో శతాబ్దాలనుండి వాటి వాటి ప్రాముఖ్యతతో వాడుకలో ఉండి ఇప్పుడు కూడా చలామణి అవుతున్నాయి కాబట్టి వీటిని ప్రత్యామ్నాయమనడం ఏమంత సబబుగా లేదు. పరిశోధనా పధ్ధతిలో, ఇది ఇలా జరగవచ్చు అనే ఊహాజనిత వ్యాఖ్యానాలను ఇతర శాస్త్ర ప్రామాణికాలతో పోల్చి, వాటి నిజానిజాలను పరీక్షించి, విఫలమైన సిధ్ధాంతాన్ని, సంప్రదాయాన్నిపాశ్చాత్య వైద్యవిధానము తిరస్కరిస్తుంది. ఒక ప్రయోగానికి చాలామంది వ్యక్తులు ఒకే రకంగా స్పందించినట్లయితే ఆ ఫలితాలను అటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్న ప్రతీ వ్యక్తికి అన్వయించవచ్చని వారు నిష్కర్షగా చెప్పుతున్నారు. ఉదాహరణకు జలుబుతో బాధపడ్టున్న పదిమందిలో కొన్ని పారామీటర్స్, (జ్వరం, పల్స్ రేట్, బి.పి. మొదలైన లక్షణాలు) ఒకేరకంగా ఉండి, ఎక్స్ ఔషధానికి వారిలో ఆరుగురు స్పందించారనుకోండి, ఇహ జలుబుతో కన్పించిన ప్రతి రోగికి అదే మందు ఖాయం అని తీర్మానించడం!
"డాట్రారూ, హా ఛ్ం
"ఓహో! జలుబా!"
లేదండీ, మరేమో, హా ఛ్ం
జలుబే, వెళ్ళు, ఎక్స్ డ్రగ్ వేసుకో" ఔరా! ఇదీ పరిస్థితి!
పాశ్చాత్య పరిశోధనా పధ్ధతులు అస్తివాదమైన "వ్యక్తిత్వ మూర్తిత్వ లక్షణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. చాలా దేశీయ వైద్య విధానాలకిదే అస్తిబలం ఎందుకంటే ఏ విషయంలోనూ ఏ ఒక్క వ్యక్తిలోను మరొక వ్యక్తి లక్షణాలు మూసలో పోసినట్లు ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించడం సర్వసాధారణం.
భారతదేశంలో హోమియోపతి ఆందోళన
ప్రత్యామ్నాయ వైద్య విధానంగా హోమియోపతి చాలా ప్రాచుర్యాన్నీ, ప్రాధాన్యతను సంపాదించింది. ఎల్లోపతి ఔషధ సేవనం వల్లవచ్చే చెడుఫలితాల గురించి ప్రజలు తెలుసుకోవడమే గాక హోమియోపతి విధానంలోని లాభాలు, ముఖ్యంగా ఎటువంటి దుష్ఫలితాలు (సైడ్ ఎఫెక్ట్స్) లేకపోవడం, చాలా స్వాభావికంగా సహజంగా చికిత్స జరగడం ప్రజలను ఈ విధానం వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. ఇంతే కాకుండా ఈ మందులు చాలా తేలిగ్గా దొరుకుతాయి, చాలా చౌక కూడా, ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ప్రజలకిది ఒక ప్రత్యామ్నాయ ఆకర్షణ.
మొదట్లో భారత హోమియోపతి వైద్యుల సంస్థ Indian Institute of Homeopathic Physicians (IIHP) లో శాస్త్రీయంగా శిక్షణ పొందిన రెండు వేల వైద్యులు సభ్యులుగా ఉండేవారు. నానాటికి పెరిగిపోతున్న సభ్యత్వం హోమియోపతి ప్రాచుర్యాన్ని చెప్పక చెప్తుంది. మహమ్మారీ వ్యాధులైన వైరల్ ఎన్సెఫిలైటిస్, మలేరియా, గాస్ట్రోఎన్‌టరైటిస్, అమ్మవారు, పక్కశూల (Infective Hepatitis) వంటి అంటువ్యాధులకు నిరోధక ఔషధాలుగా హోమియోపతి ప్రాధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. ఇటువంటి వ్యాధులేవైనా సంఘంలో తలఎత్తిన పక్షంలో ప్రజలకు రక్షణ కవచంలా హోమియోను వాడటం రాష్ట్ర వైద్య సంస్థల బాధ్యతగా ప్రభుత్వం ప్రకటించింది.
|
 |