ఇతర వివరాలు

homeopathic treatment    homeopathy treatment


"We believe in the human body's innate ability to overcome disease by itself. Our role is to understand the causes and set the natural pattern right in the least harmful and the most natural way"

Dr. Anil Nanduri


హోమియోపతి & క్లినికల్ ఎవిడెన్స్ బేస్‌డ్ మెడిసిన్:

బాండోలియర్ హోమియోపతి చికిత్సకు సాక్షాలను పరిశీలించింది. బాండోలియర్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు ఋజువులు ఆధారమైన ఔషధాల గురించి ఆన్‌లైన్ వెలువరించే వైద్య పత్రిక.

బాండోలియర్ తలనెప్పికి ఇచ్చిన హోమియోపతి ట్రయల్ చికిత్సపై రిపోర్ట్ ఇచ్చింది.

పరిశోధనల వల్ల హోమియోపతి చికిత్స హే ఫివర్స్‌కి (లాన్సెట్ 1986, ii; 881-886 మరియు బ్రిటన్ హోమియోపతిక్ జర్నల్ 1985; 74: 65-75) తవిటి పురుగుల వల్ల వచ్చే ఎలర్జిక్ ఆస్తమాలకు (లాన్‌సెట్ 1994; 344: 1601-06) మరియు రొమటాయిడ్ ఆర్థ్‌రైటిస్; (రొమటాయిడ్ ఆర్థ్‌రైటిస్‌కి హోమియో చికిత్స; విశ్లేషణ - డబుల్ బ్లైండ్ క్లినికల్ థెరప్టిక్ ట్రయల్. ఆర్. జి. గిబ్బన్ మొదలైనవారు బి.హెచ్.జె. 1986 జూలై; 75 (3); 148-57) మొదలైన వాటికి చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని రాయ్ స్టీనర్ రిపోర్ట్ చేసారు.

1992లో గ్లాస్‌గో హోమియోపతిక్ హాస్పిటల్ (బ్రిటన్) వారు ఆడిట్ చేసిన రిపోర్ట్‌ల ఫలితాల ప్రకారం ఒక సంవత్సరంలో చికిత్స తీసుకున్న వంద మంది ఔట్ పేషెంట్‌లలో చాలా మంది ఆరోగ్యవంతంగా అయినట్లు, వారి జీవితాలలో నిర్దిష్టమైన మార్పులు వచ్చినట్లు, కన్వ్‌న్షనల్ చికిత్సకు వెళ్ళటం చాలా తగ్గినట్లు తెలుస్తుంది. వాళ్ళ ఔట్ పేషెంట్‌ల డిపార్ట్‌మెంట్‌లో ఆస్థ్‌మాతో బాధ పడుతున్న చిన్న పిల్లలలోనూ, వృద్ధులలోనూ చాలా మార్పు వచ్చిందని, బ్రోంఖోడైలేటర్స్ వాడకం తగ్గిందని, డాక్టర్ల దగ్గరకు తరచుగా వెళ్ళటం తగ్గిందని రాయల్ హోమియోపతిక్ హాస్పిటల్ వారు రిపోర్ట్ చేస్తున్నారు. హోమియోపతి చికిత్స తీసుకుంటున్న పేషెంట్లు టాపికల్ స్టెరాయిడ్స్ వాడకం చాలా తగ్గించామని చెప్పారు. చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ గైనిక్ సమస్యలు చాలా బాగా తగ్గాయని, ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు. రొమటాయిడ్ ఆర్థ్‌రైటిస్ పేషెంట్లు వాళ్ళ స్టాండర్డైజ్డ్ టెస్ట్‌ల వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా అభివృద్ధి అయినట్లు తెలిసిందని చెప్పారు.

రెయ్‌ల్లీ డి.టి, టెయ్‌లర్ ఎమ్.ఏ. ఇంటిగ్రేటెడ్ మందుల తయారీ. సమకాలిక వైద్యంపై ఆర్.సి.సి.ఎమ్ రీసర్చ్ ఫెల్లోషిప్ రిపోర్ట్, గ్లాస్గో యూనివర్సిటీ, 1987-90. సమకాలిక వైద్య చికిత్సలు; 1993; 1, Suppl. 1. 1-49. పైన ఉదహరించిన ఫలితాలను బట్టి హోమియోపతి సెకండరీ (రెండవ) కేర్‌ చికిత్సను ఇవ్వగలదని నిర్ధారణ అవుతున్నది. ఇంతేకాకుండా ఖరీదయిన టాక్సిక్ చికిత్సా విధానాన్ని రెండవ స్థానంలో ఉంచి కొంతమంది డాక్టర్లు కొన్ని కొన్ని వ్యాధులకు హోమియోను ప్రాధమిక చికిత్సలా సిఫారస్ చేస్తున్నారు.

ప్రాక్టికల్ ఉదాహరణాలు:

పుట్టిన దగ్గరినుండి ఆపకుండా ఏడుస్తుండే (colic) ఆరు నెలల లోపలి శిశువులకు హోమియో "కోలోసైంథిస్‌"ని ఉపయోగిస్తున్నారు.
సర్జరీ
వల్ల వచ్చే సమస్యలను తగ్గించడానికి సర్జరీ జరిగేటపుడు హోమియో ఆర్నికా ఇస్తున్నారు.
డీసెన్సిటైజేషన్
(ఎలర్జీ నిరోధక) ఇంజక్షన్ల బదులు హోమియోలోని ఇమ్మ్యూనో థెరపీ చాలా సురక్షితమైనదని సిఫారిస్ చేస్తున్నారు.


గ్లాస్‌గో హోమియోపతి హాస్పిటల్ వారిచ్చిన సమాచారాన్ని బట్టి ఇరవై శాతం స్కాటిష్ డాక్టర్లు వాళ్ళ కోర్సులతోబాటు హోమియో ప్రాధమిక స్థాయి శిక్షణ (basic level training) పూర్తి చేసారని తెలుస్తుంది. అలాగే వారి రెగ్యులర్ కోర్సు పూర్తి చేశాక 78% డాక్టర్లు వాళ్ళ NHS (National Health Service) రెండు సంవత్సరాల పాటు హోమియోపతిలోని ప్రధాన ద్రవ్యాల (elements) మిశ్రమాలను తయారుచేయడానికి ప్రయోగాలు చేస్తున్నారని తెలిసింది. గ్లాస్‌గో రాయల్ ఇన్‌ఫర్మరీ లోని పెయిన్ క్లినిక్ (Pain Clinic), జనరల్ మెడికల్ క్లినిక్ (General Medical Clinic) లు రెండవ, మూడవ స్థాయి చికిత్సలలో కూడా హోమియోపతిని ఉపయోగించవచ్చని చూపించాయి.

వేరే మందులతో హోమియోకు కాని, దీని వల్ల ఇతర చికిత్సలకు కాని ఎటువంటి దుష్ఫలితాలు ఉండకపోవడంవల్ల గర్భిణీ స్త్రీలకు, తీవ్ర వ్యాధులతో బాధ పడేవాళ్ళకు హోమియో మందులు వాడవచ్చు. కాని హోమియో మందులను ఒక దానికి ఒకటి ఇవ్వడంలాంటి అపాయానికి అవకాశం ఉంది.అయితే ఇది హోమియోవైద్యశాస్త్రంలొ లేదు. (చేసేవారిలో ఉందని భావం).

హోమియో చికిత్సకు అయ్యే ఖర్చు: డాక్టర్లకి సమయ వ్యయం అధికం, మందుల ఖరీదు అల్పం, ఇతర వైద్య విధానాల, మందుల, పధ్ధతుల ఖర్చు మిగులుగా చూపించడం జరిగింది. గ్లాస్గోలొ ఈమధ్య కాలంలో జరిపిన సర్వేని బట్టి ఒక్క సంవత్సరంలో 37% ఔట్ పేషెంట్స్ కి కన్వెన్షనల్ మందుల ఖర్చు చాలావరకు తగ్గిందని తెలిసింది.

సారాంశం

అశాస్త్రీయమైనదని చెప్పి ఎప్పుడూ హోమియోపతివైద్య విధానాన్ని వర్ణించడం, అపహసించడం, జరుగుతూ వస్తుంది. ఇటువంటి వ్యతిరేక పరిస్థితులలో కూడా గత రెండు వందల సంవత్సరాలుగా హోమియోపతి తన స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా చక్కటి పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నది. మొదటగా ఈ విధానము ఒక డాక్టర్ వల్ల అభివృధ్ధిని పొందడం ప్రారంభించింది. ఆయన శాస్త్రీయ పధ్ధతీకరణ ప్రయోగాలు చేయడానికి అవలంబించే నియమావళి చాలా కఠినంగా ఉండేది. మందులను కనిపెట్టడం కోసం వరుస క్రమంలో పదార్థాలను వైబ్రేట్ చేస్తూ డైల్యూట్ చేస్తూ ఉండటమే క్లిష్టతరమైనప్పటికి డబల్ బ్లైండ్ ప్రయోగాలు సత్ఫలితాలు ప్లాసిబో కంటె వేగంగా ఫలితాలనిచ్చే మందుల తయారీ విధానాన్ని వివరించాయి. పరీక్షా విధానం (trial) ఎంత తీవ్రమైతే ఫలితం అంత సకారాత్మకంగా ఉండటం ఆయా పదార్థాలు ఎంత ప్రభావ వంతంగా ఉన్నాయో తెలియచేస్తుంటాయి. అంతేకాక ఈ రోజుల్లో డ్రగ్స్ నాణ్యత పరిశోధించే నియమావళీ విధానం ఎంత వరకు సబబు అని సవాలు చేసినట్లుగా ఉంది. ఏ ఫలితాల అవలోకన వైద్యశాలల్లో (clinics) ఈ మందులు (preparations) ఉపయోగ పడ్తాయని, మందుల ప్రస్తుతపు ధరలు చెప్పుకోదగ్గ మేరకు తగ్గడానికి అవకాశాముందని తెలుస్తుంది. హోమియోపతి ఎంత సమర్థవంతమైన చికిత్సో తెలుపుతూ ఇన్ని వాస్తవాలు ప్రయోగాల ద్వారా వెలికి వస్తున్నపుడు ఇంకా ఈ శాస్త్రాన్ని సందేహించడం శాస్త్రజ్ఞుల అశాస్త్రీయ దృక్పధమని నా విశ్వాసం. ఈ చికిత్స "ఆధునిక కాలపు సర్వరోగ నివారణి" కాదు, కాని ఈ శాస్త్రపు సిద్ధాంతాలను "ఇతర శాస్త్ర డాక్టర్లు" అంగీకరించినట్లయితే ఈ వైద్య శాస్త్రపు బలాలు, బలహీనతలు చూపించడానికి ఎంత కృషియైనా చేయవచ్చు. ఈ రకంగా కృషి చేసినట్లయితే దైనందిక ప్రాక్టీస్లో దీనిని కూడా చేర్చవచ్చు. పోటీగా ఉన్న ప్రత్యామ్నాయ చికిత్సా విధానంలా కాకుండా దీనిని వైద్య పరంగా చేయూతనిస్తున్న శాస్త్రంలా పరిగణిస్తే బాగ
ుంటుంది.




 

Homeopathic Treatment   |  About Homeopathy  |  About Us  |   FAQ  |  Articles & Links  |  Consultation  |   Contact Us  |  Blog