ఈ ప్రశ్నావళికి వీలయినంత వరకు "పూర్తిగా" వివరాలనివ్వండి. వైద్యానికి ఉపయోగపడవని మీరనుకునే వివరాలు, మాకు చాలా ప్రధానం కావచ్చు. ఎలా అంటే, మీ అలవాట్లు, మీ ప్రవర్తనాధోరణి, మీ మూడ్స్ మొ|| అలాంటివి దయచేసి పూర్తిగా వ్రాయండి. ప్రశ్నావళిలో ప్రత్యేకించి అడగనివి, మీకు ప్రధానంగా అన్పించేవి ఏవైనా ఉంటే తప్పక వ్రాయండి. అలాంటివి ఆ వ్యాధికి మీ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మాకు ఉపయోగపడి, మేము మీకు బ్రహ్మాండమైన మందులివ్వడానికి సహాయపడ్తుంది. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో మీలో శారీరిక, మానసిక మార్పులు - ఆకలి ఎలా ఉంది? ఏది తినాలని ఉంది? ఏది చూస్తే వెగటు పుడుతుంది? స్వభావంలో ఏవైనా మార్పులు ఉన్నాయా? నిద్ర ఎలా ఉంది? కడుపు ఖాళీ అవుతుందా? లేదా? కలలు ఎలాంటివి? వగైరా. మీరు మీలో అలాంటివి ఏవైనా గమనించినట్లైతే మాకు తెలపండి.
పేరు :
వయసు:
ఈమెయిల్:
దయచేసి మీ ప్రస్తుత సమస్య గురించి క్లుప్తంగా వ్రాయండి. ఎప్పటి నుండి ఇలా ఉంటుంది (వరస వారీగా - మేము చలిలో బయటికి ______ రోజులకోసం వెళ్ళాక ________ లో మొదలైంది. ఇలా అన్నమాట) ఫలానా రోజునుండి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది.
కుటుంబ చరిత్ర: ఫ్లాష్‌బాక్‌లో మీ తాతగార్ల వరకూ (అటూ-ఇటూ) వెళ్ళి ఎలర్జీలు, చర్మ వ్యాధులు, ఆస్థ్‌మా, మైగ్రేన్, గుండె వ్యాధులు, కాన్సర్లు, మానసిక్ వ్యాధులు లాంటి వాటి గురించి కూడా వివరాలు ఇవ్వాలి. (మా అక్కకి ఎగ్జీమా ఉంది / ఉండేది, మా మేనత్త హార్ట్ సమస్యలతో పోయారు. మా అమ్మమ్మకి Alzheimers ఉండేదిట.)
మీకు గుర్తున్నంతవరకు. మీ డెలివరీ మామూలేనా? సిజేరియనా? పుట్టిన పిల్లలకి జాండీస్ లాంటివి ఏవైనా వచ్చాయా? మీజిల్స్, మమ్స్, టైఫాయిడ్ లాంటివి ఏవైనా ఉన్నాయా? టీకాలు వేసాక జ్వరం, విరేచనాలు, తరచుగా జలుబు రావడం ముక్కు కారడం, దగ్గులాంటివి వచ్చాయా?
జీవితంలో మైలురాళ్ళు: (మీకు గుర్తున్నంతవరకు) పళ్ళు రావడం(ఆలస్యం,తొందరగా, నార్మల్), మొదటిసారిగా కూర్చోవడం, నడవడం,మాట్లాడటం, మొ|| సరియైన సమయాన వచ్చాయా?
దెబ్బలు, ఎముకలు విరగడం, యాక్సిడెంట్లు, తలకి గాయాలు, కుక్క/ఇన్సెక్ట్ కాట్లు వగైరా.
దైనందిక విషయాల వివరణ:
1. ఆకలి ఎలా ఉంటుంది?
2. ఏదో ఒక ప్రత్యేకమైన ఆహారం/రుచి ఇష్టమా?(మిఠాయిలు, పుల్ల పదార్థాలు, చట్ పటానమకీన్స్)
3. ఆహారంలో ఏదో ఒక పదార్థం పడదా?
4. ఏ వెదర్ లో మీరు హాయిగా ఉండగల్గుతారు?
5. ఏదో ఒక వెదరో, వాతావరణమో ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుందా?
6. చెమట పడ్తుందా?( ఎక్కడ? ఎలాంటి పరిస్థితులలో?(తినేటప్పుడు,ఆదుర్దాగా ఉన్నపుడు, బాగాపని చేసినపుడు)
7. సాధారణంగా మీకు ఆరుబయట బాగుంటుందా? తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చుంటే ప్రాణం హాయిగా ఉంటుందా?
8. కలలు వస్తాయా? గుర్తు ఉంటాయా?సారాంశం ఏంటి?(రోజూ జరిగే సంఘటనలు, అంతరిక్షం లో పడిపోతున్నట్లు, ట్రెయిన్ వెనకాల పరిగెత్తుతున్నట్లు వగైరా)
9. మీ నిద్రానైజం ఎలాంటిది?(ఫ్రెష్, డల్, వగైరా)
10. బవల్స్ అలవాటు ఎలాంటిది?(మలబధ్ధకమా? రెగ్యులరా?ఆదుర్దాగా ఉన్నపుడు లేదా మసాలా గట్రా ఎక్కువ అయినపుడు కడుపు కదలడం, వగైరా)
11. ఎన్ని నీళ్ళు తాగుతారు?(ఎప్పుడు దాహంగా ఉంటుందా? నార్మలేనా?)
12. మీ గురించి మీరు ఏమనుకుంటారు? (ఫ్రెండ్ లీ, హాపీగో, ఒంటరిగా ఉండటం,పదిమందితో కలిసి ఉండటం) పరిశుభ్రంగ ఉంటూ, ఉంచుతూ ఉంటారా? చాలా ఫస్ చేస్తారా? పనులన్ని నిర్దిష్టమైన సమయంలో చేస్తూ మిగతా వాళ్ళు చేయకపోతే మీ రియాక్షన్ ఏంటి?
13. మానసిక, శారీరిక ఒత్తిడి, ఆదుర్దా సమయాలలో ఎలా రియాక్ట్ అవుతారు? (మాటల్లో వ్యక్తం చేస్తారా? మీలోనే ఉంచుకుంటారా? అలా వాటిగురించే తవ్వకాలు చేస్తుంటారా? ) ఇవికాక ఇంకా ఏవైనా ఉంటే చెప్పండి.
పీరియడ్స్ ఎపుడు మొదలైయ్యాయి? రెగ్యులరా? కాదా?
పీరియడ్స్ వచ్చేముందు శారీరిక బాధలు ఏవైనా ఉన్నాయా? బ్రెస్ట్స్ భారంగాకాని, నెప్పిగాకాని ఉంటాయా? మూడ్స్ లో మార్పులు? ఆకలిలో మార్పులు, నడుం నెప్పి, కాళ్ళు నెప్పులు, తలనెప్పి వగైరా?
పీరియడ్స్‌కి పీరియడ్స్‌కి మధ్య వ్యవధి? ఎన్నిరోజులు బ్లీడింగ్? (మూడు నుండి అయిదు రోజుల వరకు, 27 రోజుల వ్యవధి)
కుటుంబ నియంత్రణమా? మందులు వాడుతున్నారా? (Yes / No)
పీరియడ్స్‌కి ముందు / అప్పుడు / తర్వాత డిస్చార్జ్ అవుతుందా? (Before / During / After)
పిల్లలెంత మంది? నార్మల్ ప్రసవమేనా? తరువాత ఏమైనా సమస్యలున్నాయా? పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చారా? లేదా? ఆ ఫేజ్‌లో ఏమైనా సమస్యలున్నాయా లేదా?
గర్భస్రావాలేవైనా జరిగాయా? లేదా? (జరిగితే) వాటి వల్ల సమస్యలున్నాయా?
మెనోపాజ్ ఎన్ని సంవత్సరాలకు మొదలైంది? పీరియడ్స్ క్రమ క్రమంగా పోయాయా? సడన్‌గా ఆగిపోయాయా? (gradually / abruptly)
పెల్విక్ ఏరియాలో ఏవైనా ఆపరేషన్లు జరిగాయా? జరిగి ఉంటే వాటి వివరాలు.