పి. జార్జ్, హైదరాబాదు : ఎలర్జీ
హోమియోపతి చికిత్సకు నేను చాలా అయిష్టంగా వచ్చాను కాని యిపుడు పూర్తిగా హోమియోపతికే కన్వర్ట్ అయ్యాను. చాలా కొద్దిపాటి పరిమాణంలో తీసుకునే ప్రాకృతిక పదార్థాలవల్ల శరీరం ప్రభావితమవుతుందన్న తర్కం యీ రోజుకీ నాకు అర్థం కాక పోయినా అటువంటి ఫలితాలను నేను స్వయంగా నాలోనూ, నేను రిఫర్ చేసి డాక్టర్ అనిల్ గారి దగ్గరకు పంపిన నా స్నేహితులలోనూ చూశాను. నా ఎలర్జీలకు, (కిడ్నీ స్టోన్) మూత్ర పిండంలో రాయి, నడుంనెప్పి, జలుబు, ఫ్లూ, కడుపుకు సంబంధించిన చిన్న చిన్న బాధలు లాంటి ఇంకా చిన్న చిన్న జబ్బులు - ఇవన్నీ కూడా అంత చిన్న చిన్న పిల్స్‌తో తగ్గిపోయాయి. అన్ని వైద్య విధానాలలో నేను హోమియోపతికే మొగ్గు చూపుతాను. డాక్టర్ ప్రశాంత్ గారు, డాక్టర్ అనిల్ గారు ఇద్దరూ చాలా నిష్ణాతులైన డాక్టర్లేకాక చక్కటి స్నే"హితులు" కూడా.
కస్తూరి టి. (న్యూజెర్సీ, అమెరికా) : రొమెటిక్ కీళ్ళనెప్పులు
ఎన్నో సంవత్సరాలుగా నండూరి డాక్టర్లు మా స్నేహితులు, మా కుటుంబ వైద్యులు కూడా. వారు వారి చికిత్స ద్వారా మేము ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ మధ్యనే వారు దీర్ఘకాలం వేధించిన జ్వరానికి, కీళ్ళనెప్పులకు చికిత్స చేశారు. వీరి మందులు వాడుతున్న నేను ఇపుడు బాగా ఉన్నట్లు ఫీల్ అవుతుంటాను. వైద్యావసరం ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఈ డాక్టరుని రికమెండ్ చేస్తాను.
నాన్సీ. ఎస్. (కెనడా) : ఆర్థ్‌రైటిస్
సెలవులకి ఇండియాకి వచ్చినప్పుడు ప్రశాంత్ గారి దగ్గర్ నేను చికిత్స తీసుకోవడం ప్రారంభించాను. నేను మా ఇంటికి టోరన్‌టో తిరిగి వచ్చాక కూడా ఈమెయిల్ ద్వారా వైద్యం జరుగుతుంది. ముఖ్యంగా నడుం క్రింద భాగంలో ఆస్టియోఆర్థ్‌రైటిస్ తో నేను బాధ పడ్తుండేదాన్ని. చాలా బాధాజనకమైన పరిస్థితి. ఈమెయిల్ ద్వారా ప్రశాంత్ గారిని సంప్రదిస్తే నా పరిస్థితి, బాధను అవగాహన చేసుకుని, దానికి తగినట్లుగా రెగ్యులర్‌గా వారు పోస్ట్‌లో మందులు పంపుతుండేవారు. కొంత కాలమయ్యాక నాకు పూర్తిగా స్వస్థత చేకూరింది. ప్రపంచానికి ఒక వైపు ఆయన ఒక వైపు నేను అన్నంత దూరంలో ఉన్న వారు నాకు చాలా సునాయాసంగా చికిత్స చేసి స్వస్థత చేకూర్చారు.
పర్మేష్. బి. (జపాన్) సోరియాసిస్
1999 నుండి నాకు చర్మసమస్యలు - చర్మం చాలా పొడిగా ఉండటం, మొటిమలు చిన్నగా మొదలయి మెల్లగా అందులో చీము చేరడం - చాలామటుకు చేతులు, వీపు మీద ఉండేవి. రోజు రోజుకి పరిస్థితి హీనంగా తయారవుతూ ఉండేది. జపాన్ లోని పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో స్కిన్ స్పెషలిస్టులను సంప్రదించాను, కెనడాలో, అమెరికాలో నిపుణులను (ఎక్స్‌పర్ట్స్) కలుసుకున్నాను కాని నిష్ప్రయోజనమే అయింది. ఎందుకు వస్తున్నాయనే కారణం ఎవరూ చెప్పలేక పోయారు. వీరందరూ కూడా రకరకాల మందులు, టన్నుల కొద్ది ఇంజెక్షన్లు ఇచారు. ఊహు! లాభంలేక పోయింది.
2000 ఫిబ్రవరి లో వ్యాపార నిమిత్తము ఢిల్లీ వెళ్ళాను. బ్రేక్‌ఫాస్ట్ అపుడు నా స్నేహితుడొకడు, నాచేతిని గమనించాడు. ఎక్కడా సరియైన వైద్యం దొరకలేదని చెప్పితే దిగ్భ్రాంతుడయ్యాడు. నాకు సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లోని డాక్టర్కి ఫోను చేసి, మాట్లాడమని నాకిచ్చాడు.
నేను డాక్టర్ అనిల్ ప్రశాంత్‌తో మాట్లాడాను. వారు నన్ను 13 నుండి 16 ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నోత్తరాల తరువాత నాకు ఏమయిందో పూర్తిగా వారికి తెలిసిందని చెప్పారు.
రెండు రోజుల్లో ఫెడ్‌ఎక్స్ పార్సెల్ ద్వారా హైదరాబాద్ నుండి నేనున్న హోటల్‌కి హోమియో మందులు వచ్చాయి. ఒక నెలరోజుల పాటు ప్రొద్దున 5, రాత్రి 5 పిల్స్ వేసుకోవలసిందిగా చెప్పారు. ఆ రోజు నుండే నాకు నయమవడం మొదలుపెట్టింది. నా వీపు ఇపుడు చాలా శుభ్రంగా ఉంది. నా కుడి చేయి ఎటువంటి మొటిమలు గట్రా లేకుండా శుభ్రంగా ఉంది. ఎడమచేయి ఇంకా ఫైనల్ స్టేజిలో ఉంది. ఎందుకో తెలియదుకాని ఈ హోమియో వైద్యం నాకు చాలా బాగా పని చేసింది పైగా ఎటువంటి దుష్ఫలితాలు (side effects) లేవు. ఇది చూసిన నా భార్య (జపానీ అమ్మాయే) కూడా డాక్టర్ ప్రశాంత్‌గారి దగ్గర వైద్యం తీసుకోవడం మొదలు పెట్టింది. తనకు హెమోగ్లోబిన్ తక్కువ. ఇపుడు తను కూడా చాలా ఆరోగ్యంగా ఉంది.
హర్లాన్.జె. (రాక్‌ఫొర్డ్, ఇలినాయ్‌స్, అమెరికా) : ఎగ్జిమా.
నాకు చాలా సంవత్సరాలుగా ఎగ్జిమా ఉండేది. మధ్య మధ్యలో రావడం, పోవడం జరుగుతుండేది. డాక్టర్ ప్రశాంత్ హోమియోపతి చికిత్స ప్రారంభించారు. బ్రహ్మాండమైన ఫలితం కన్పించింది. అకస్మాత్తుగా పూర్తిగా తగ్గిపోయింది. కాని మళ్ళీ రావడంతో నేను తిరిగి వారిచ్చిన మందులు వాడాను. మళ్ళీ పూర్తిగా తగ్గింది. దీర్ఘకాలిక్ పరిష్కారం మెల్లగా దొరుకుతుంది.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే వాడటం మొదలుపెట్టాక మానకుండా వారు చెప్పిన విధంగా తీసుకుంటూ, మన పరిస్థితి తరచుగా డాక్టర్ ప్రశాంత్ గారికి తెలియజేస్తూ ఉండాలి. ప్రతి ఓవర్‌నైట్ మిరకల్ వెనకాల ఎన్నో ప్రయోగాలు, అవి విఫలమైన సమయాలు కూడా ఉన్నాయి కాని నాకు పూర్తిగా నయమయింది. [డాక్టర్ చివరిగా విజయాన్ని సాధించారు]
కేట్టూ
నాకు డాక్టర్ ప్రశాంత్‌గారు 1976 నుండి తెలుసు, వారి వైద్యం లేకుండా నేనేమీ చేయలేను. వారి మందుల్ని నేను "మిరకల్ డోస్" (అద్భుతమైన మందులు) అంటాను, ఎందుకంటే ఒక్క డోస్ మందుతో వారు నన్ను కోలుకొనేలా చేస్తారు. వారు విదేశాలకు హాలిడే కోసం వెళ్ళినా - టెలిఫోను నెంబరు తీసుకోకుండా వెళ్ళనివ్వను. వారి డయాగ్నసిస్ నూటికి నూరు పాళ్ళు సరియైనది, అందుకనే వారిచ్చే మందులు కొద్ది సమయంలో అద్భుతాలను చేస్తాయి. హోమియోపతి మందులు చాలా మెల్లగా పని చేస్తాయని, ఒక వ్యాధి తగ్గడానికి చాలా కాలం పడ్తుందనే అపోహని ఆయన పూర్తిగా తొలగించారు.
కె. అప్పన్న (హైదరాబాదు, ఇండియా) : కాన్సర్
ముంబాయి టాటా మెమోరియల్ హాస్పిటల్లో కుడి వోకల్ కార్డ్‌నకి లేజర్ ఆపరేషన్ జరిగిన తర్వాత 25/05/2001 నుండి డాక్టర్ ప్రశాంత్‌గారి హోమియోపతి మందులు వాడుతున్నానని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కాన్సర్ చికిత్సలో ఒక భాగంగా నా వోకల్ కార్డ్స్‌కి లేజర్ వైద్యం చేసారు. కాని మళ్ళీ యీ జబ్బు తిరగబడటానికి అవకాశాలున్నాయని చెప్పారు. లేజర్ వైద్యం అయ్యాక బొంగురు గొంతులా అయి, మాట్లాడుతుంటే గొంతు నెప్పిగా ఉండేది. ప్రశాంత్‌గారి దగ్గర వైద్య సహాయాన్ని అర్థించాను. ఆయనే నాగురించిన పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇపుడు నాకు నెప్పి లేదు. చక్కగా మాట్లాడగల్గుతున్నాను. ఈ మధ్యనే టాటా హాస్పిటల్‌కి చెక్ అప్ కోసం వెళ్ళాను. ఇంకా జబ్బు మళ్ళీ వచ్చే అవకాశమే లేదని చెప్పారు. నేను డాక్టర్ ప్రశాంత్ గారికి, హోమియోపతిని (నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు) సదా కృతజ్ఞుణ్ణి.
రోహిణి. జి. (లండన్, యు. కె.)
నేను డాక్టర్ అనిల్ నండూరి గారి దగ్గర టిన్నైటిస్ సమస్య, (చెవులలో గంటల చప్పుడు / జోరీగ చప్పుడు), ఆస్తమా, చర్మానికి సంబంధించిన సమస్యకు ఒక సంవత్సరం నుండి మందులు తీసుకుంటున్నాను. ఆయన చికిత్స చాలా ప్రభావవంతంగా ఉంటుందని నేను దృఢంగా చెప్పగలను. నా బ్రీడింగ్ సమస్య చాలా నయమయింది, నాకు మళ్ళీ శ్వాసకు సంబంధించిన ఎట్టాక్స్ రావడం లేదు. నన్ను విపరీతంగా వేధించి బాధించిన గంటలచప్పుడు పూర్తిగా ఆగిపోయింది. నా ఆస్తమా, చర్మ సమస్యలు కంట్రోల్లో ఉన్నాయి. నేను ఇండియాలోని నా స్నేహితులకి, నా ఇంగ్లీషు స్నేహితులకి, కలీగ్స్‌కి అనిల్ గారిని సిఫార్సు చేస్తున్నాను.
కె. సేన్ (ఫిలడెల్ఫియా, అమెరికా)
చాలా సంవత్సరాలుగా సోరియాసిస్‌కి స్టెరాయిడ్స్ తీసుకుంటున్న మా అమ్మాయికి డాక్టర్ నండూరి అనిల్‌గారు భగవంతుడు మాకు ఇచ్చిన వరం. మా అమ్మాయి ఇప్పుడు చాలా కోలుకుంది. మా స్నేహితురాలి ఫుడ్ ఎలర్జీ అనిల్‌గారి చికిత్సతో తిరుగుముఖం పట్టింది. తనే ఈ డాక్టర్ని రికమండ్ చేసినపుదు మొదట మాకు ఈ వైద్య విధానం గురించి చాలా అనుమానాలు, సందేహాలు ఉండాలి కాని వెబ్ లో ఈ చికిత్స గురించి చదివాక, అనిల్‌గారితో మాట్లాడాక, ఆయన చికిత్సా విధానాలగురించి తెలిసాక అసలు పూర్ణతా దృక్పధవైద్యులు (ఒక ప్రత్యేకమైన వ్యాధిని కాకుండా రోగిని ఒక వ్యక్తిలా చూసి, ప్రస్ఫుటంగా కనిపించే బాహ్య లక్షణాలతో పాటు రోగి మానసిక స్థితిని, వ్యక్తిత్వాన్ని సమీక్షించి రోగ లక్షణాలకు కాకుండా కారణాలకు వైద్యం చేసేవారు) అన్న పదానికి అర్థం తెలిసింది, అలాంటి వైద్యులంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. నేను నా స్నేహితులందరికి డాక్టర్ అనిల్ గురించె చెప్పి, రికమండ్ చేసి, వారు కూడా స్వస్థులయ్యేలా చేస్తున్నాను.
ఆదేశ్. ఎస్. (కాలిఫొర్నియా, అమెరికా)
ఇండియాలోని మా స్నేహితులొకరు చెప్పగానే నేను డాక్టర్ అనిల్ నండూరి గారిని మా డాడీ కోసం సంప్రదించాను. మాడాడీకి కాన్సర్ గురించి ఇచ్చిన రేడియేషన్ చికిత్సవల్ల సైడ్ ఎఫెక్ట్స్‌తో చాలా బాధ పడుతుండేవారు. చాలా స్ట్రాంగ్ ఎల్లోపతి మందులవల్ల ఆయన పూర్తిగా బలహీనమయిపోతుంటే ఏదైనా సింపుల్, సేఫ్ మందులున్నాయా అని కనుక్కోవడం మొదలుపెట్టాము. అలాంటి స్థితిలో మా స్నేహితుడు అనిల్‌గారి పేరు చెప్పడం, మేము వారితో మాట్లాడటం జరిగాయి. అనిల్‌గారు చాలా ప్రశాంతంగా, ఎంతో ఓపిగ్గా కేస్ టేక్-అప్ చేసే విధానం, మందులు సరిగా తీసుకుంటున్నామా, ఏవైనా ఇబ్బందులున్నాయా? ఎంత వరకు కంఫర్టబుల్ గా ఉన్నాము - ఇలాంటివి కనుక్కోవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయాలు. చికిత్సా పద్ధతిని విడమరచి మనకు అర్థమయ్యేలా చెప్పడానికి వారు చాలా శ్రమ తీసుకుంటారు. మెల్లగా హోమియో పాలియేటివ్ చికిత్స (వ్యాధిని తగ్గించలేకపోయినా, బాధని, వ్యాధి దుష్ఫలితాలను తగ్గించే చికిత్సావిధానం) లోకి మారాక మా డాడీ పరిస్థితి చాలా మెరుగయింది.
కరణ్. టి. (పూణె, ఇండియా)
నావోకల్ కార్డ్స్ సర్జరీ అయాక, మా డాక్టర్స్ ఇచ్చిన స్ట్రాంగ్ ఎల్లోపతి మందులకు బదులుగా వేరే ఏదైనా విధానమో, మందులో ఉన్నాయా అంటూ చూడటం మొదలు పెట్టాను. వెబ్‌లో డాక్టర్ అనిల్ నండూరి గారి గురించి చదివిన వెంటనే వారితో మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. ఆయనెంతో ఓపిగ్గా ఎలా చికిత్స చేస్తారో వివరించారు. నేను ప్రయత్నం చేయడానికే సిద్ధమయ్యాను. ఫలితాలు మెల్లగానే ఉన్నా ఎల్లోపతి మందులు వాడినప్పటిలా ఏటువంటి సైడ్ ఎఫెక్‌ట్స్ లేవు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నేను డాక్టర్ అనిల్‌గారిని మనస్ఫూర్తిగా సిఫారిస్ చేస్తున్నాను.
రమేష్. జి. (హైదరాబాదు, ఇండియా)
చుండ్రుకు బట్టతల మొదలవుతుండగానే టాపికల్, ఓరల్ మందులు చాలా తీసుకున్నాను. కాని లాభం లేక పోయింది. చిన్న చిన్న జబ్బులకు కూడా మా ఇంట్లో అందరూ హోమియోపతి వాడుతుంటారు. అందుకనే నేను కూడా సరే! శోధించి చూద్దామని డిసైడై పోయాను. కొంతమంది హోమియో డాక్టర్ల దగ్గర మందులు తీసుకున్నాను కాని ఫలితం శూన్యం. అనిల్ ప్రశాంత్ గారి వద్దకు వెళ్ళాను. ఆయన స్పష్టంగా ఎలా ట్రీట్ చేస్తారో చెప్పారు. గత నాలుగు నెలలుగా ఆయన మందులే వాడుతున్నాను. చాలా వరకు జుట్టు ఊడటం తగ్గింది. చుండ్రు కూడా ఫరవాలేదు. తగ్గింది. ఆయనకు నా కృతజ్ఞతలు.
బి.రావు (హైదరాబాదు, ఇండియా)
దీర్ఘకాలిక వ్యాధులకూ, ముదిరిన జబ్బులకు మాత్రమే హోమియోపతి చికిత్స మంచిదని నేనెప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ణి. డాక్టర్ శివప్రశాంత్ గారిని కలుసుకున్నాక నేనెంత అపోహలో ఉన్నానో, నా అభిప్రాయం ఎంత సత్యాదూరంగా ఉందో తెలిసింది. యూరినరీ సమస్య చాలా తీవ్రంగా ఉన్నపుడు నేను చికిత్సకు ఆయన దగ్గరికి వెళ్ళాను. నాకేమో చాలా నెప్పికా ఉంది. ఆ సమయంలో ఏదైనా సలహా అడగడానికి ఆయన ఒక్కరే దొరికారు. నాకు ఇష్టం లేకపోయినా మా అబ్బాయి ఆయన్ని కన్సల్ట్ చేసి మందులు తెచ్చాడు. వావ్! ఆ మందులెంత త్వరగా పని చేశాయో! ఎంత బాగా పని చేశాయో! నిజంగా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సీరియస్, క్రిటికల్ కేసులలో కూడా సరియైన హోమియో మందు తక్షణమే పని చేస్తుందని తర్వాత ప్రశాంత్ గారు నాకు చెప్పారు. ఇపుడు ఆయన మా ఫామిలీ డాక్టర్, అర్జంట్‌గా ఏదైనా చికిత్స కావాల్సిన పరిస్థితుల్లో కూడా ఆయన్ని సంప్రదిస్తాము.
ఎన్. రావు (సిద్దిపేట్, ఇండియా)
డాక్టర్ శివప్రశాంత్ గారు నా కిడ్నీ స్టోన్స్ వ్యాధిని పూర్తిగా నయం చేశారు. నాకు విపరీతమైన నెప్పి, ఆపరేషన్ అంటే భయం. నా సహోద్యోగి హోమియో ఎందుకు ప్రయత్నించకూడ దంటూ సలహా ఇచ్చారు. సో, నేను డాక్టర్ ప్రశాంత్‌గారిని సంప్రదించాను. ఆయన నాకు చికిత్స చేయడం మొదలుపెట్టి తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు సూచించారు. చికిత్స మొదలు పెట్టిన జస్ట్ మూడు నెలల్లో నేని యూరిన్ పాస్ చేస్తున్నపుడు స్టోన్స్ పడిపోయాయి. నేనిపుడు ఎవరికైనా "కిడ్నీ స్టోన్స్" అంటే చాలు ఆయన పేరు రికమెండ్ చేస్తున్నాను. కిడ్నీ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ అనగానే ఏవో గుళక రాళ్ళలాంటివో ఏమిటో అని అనుకుంటాం కాని, ఇవి గసగసాల సైజ్ నుండి బియ్యపుగింజ లేదా సన్న ముత్యమంత సైజుల్లో ఉంటాయి. యూరిన్‌లోని వేస్ట్ పదార్థం గట్టి పడి కిడ్నీ లో పేరుకుపోతుంది. (కొంత మందికి ఇవి పెద్దగా ఉండి యూరిన్ పాస్ చేయటం కష్టం, బాధాకరం. కాని చికిత్సవల్ల చిన్నవి అయితే యూరిన్ గుండా ఏ బాధ లేకుండా వెళ్ళిపోతాయి.
ఎమ్. ఆలీ. (హైద్రాబాద్, ఇండియా) స్లిప్డ్ డిస్క్
డాక్టర్ శివప్రశాంత్ గారి వద్దకు నేను స్లిప్డ్ డిస్క్‌కి, సర్వికల్ స్పాండిలైటిస్‌కి చికిత్స తీసుకున్నాను. పూర్తిగా స్వస్థుణ్ణి అయ్యాను. హైద్రాబాద్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో, నా సహోద్యోగులు కొంత మంది కూడా వారి పేషెంట్సే. వాళ్ళు జాయింట్ నెప్పులతో, వ్యాధితో బాధ పడ్తుంటే, ఆయన చాలా ఓపిగ్గా మన బాధ అంతా వింటారు. చాలా జాగ్రత్తగా చికిత్స చేస్తారు. వారందరికీ కూడా వైద్యపరంగా ఆయన ఎంతో హెల్ప్ చేశారు.
ఆర్. గోపాల్ (ఇండియా)
నేను చాలా సంవత్సరాలుగా చెవులలో గణగణ గంటానాదాలతో, మైకంగా ఉండటం, అప్పుడప్పుడు వాంతి వస్తున్న ఫీలింగ్ వీటన్నింటితో బాధ పడ్తుండే వాడిని. డాక్టర్స్ దీన్ని మినియార్స్ (Miniarc's) వ్యాధి అని చెప్పారు. ఎప్పుడూ మందులు వాడుతుండాటమే, వాటి వల్ల తాత్కాలికంగా ఉపశమనం దొరికేది. అంతే. మా సిస్టర్ నండూరి వాళ్ళదగ్గర హోమియో మందు ప్రయత్నం చేసి చూడమని సలహా ఇచ్చింది. గత్యంతరం లేక, చాలా అయిష్టంగానే వాళ్ళ వద్దకి వెళ్ళాను. ఒక ఆరు నెలలపాటు వారిచ్చిన మందులు మాత్రం ఠంచన్‌గా వాడాను నాకే మాత్రం నమ్మకం లేకపోయినా. తమాషా ఏమిటంటే నా సిస్టమ్ చక్కగా ప్రతిస్పందించింది. నా వ్యాధి చాలా నయమయింది. ఆరు నెలల తర్వాత అన్నిమందులు, హోమియోపతిలో సహా, ఆపేయమని చెప్పారు. నాకెందుకో అయిష్టంగానే ఉండాలి. అయినా సరే వాళ్ళ సలహా విని వాళ్ళు చెప్పిన యోగ అభ్యాసం చేయడం మొదలు పెట్టాను. ప్రస్తుతం, ఒక సంవత్సరం తర్వాత, అన్ని మందులు ఆపినా కూడా, నేను చాలా చాలా బాగున్నాను. వీళ్ళకి నా థాంక్స్. నేను చక్కగా మళ్ళీ నా బ్యాంక్ విధులను చేసుకోగల్గుతున్నాను.పరిశీలించడం జరుగుతుంది.